కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఒక్క సినిమాతోనే చిత్ర పరిశ్రమనే తన అభిమాని గా మార్చుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం కెజిఎఫ్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఈ చిత్రబృందం తెలుగు రాష్ట్రాల్లో మెరుపు వేగంగా తిరుగుతున్నారు. ఇక తాజాగా తిరుపతిలో కెజిఎఫ్ 2 చిత్ర బృందం సందడి చేసింది. ఈ ప్రెస్ మీట్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్.. తనకు ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
చిత్ర పరిశ్రమలోకి వచ్చే ఎవరికైన మెగాస్టారే ఇన్స్పిరేషన్.. అయితే తన సినిమాల్లో హీరోను ఎలివేట్ చేయడం మాత్రం చిరు సినిమాను చూసే నేర్చుకున్నానని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పుకురావడం విశేషం. ” నేను చిన్నప్పటినుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూనే పెరిగాను. న సినిమాలో హీరోకు ఎలివేషన్ ఇచ్చే సీన్స్, మాస్ ఎలిమెంట్స్ సీన్స్ బావుంటాయని చెప్తున్నారు.. అందుకు కారణం చిరంజీవి గారే.. ఆయనే నా ఫెవరేట్ హీరో.. ఆయన సినిమాల్లో చూపించే మాస్ సీన్స్ , ఎలివేషన్స్ నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నా హీరో కూడా అలాగే ఉండాలి అనుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.