యంగ్ అందు టాలెంటెడ్ బ్యూటీ నివేతా పేతురాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బ్లడీ మేరీ. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆహా లో వెబ్ ఒరిజినల్ గా ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా బ్లడీ మేరీ ట్రైలర్ ను ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్, నిఖిల్ సిద్ధార్థ విడుదల చేశారు, ట్రైలర్…
కెజిఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా విజయంతో టాలీవుడ్ లో కెర్స్ తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇక టాలీవుడ్ లో ఈ డైరెక్టర్ తీస్తున్న చిత్రాలలో క్రేజియెస్ట్ కాంబో గా నిలిచింది మాత్రం ఎన్టీఆర్ తోనే అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ 2 రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. …
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ ఏప్రిల్ 14 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడెప్పుడు…
ఒకప్పుడు జబర్దస్త్ అంటే నాగబాబు, రోజా అల్టిమేట్ కాంబో.. నాగబాబు నవ్వు.. రోజా అదిరిపోయే పంచ్ లతో ఆ షో ఒక రేంజ్ లో ఫేమస్ అయ్యింది. ఇక కొన్ని కారణాల వలన నాగబాబు షో నుంచి తప్పుకున్నా రోజా మాత్రం తనకు అచ్చి వచ్చిన జబర్దస్త్ వదలలేదు. ఒకపక్క ఎమ్మెల్యే గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోపక్క జబర్దస్త్ షో పై అందంతో ఆకట్టుకొంటూనే ఉంది. ఎంతమంది జడ్జ్ లు వచ్చినా.. వెళ్లినా రోజా లేని జబర్దస్త్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గావ్యవహరిస్తున్న షో లాకప్. అతి కొద్దిరోజుల్లోనే ఈ షో టాప్ షోలలో ఒకటిగా నిలిచింది. ప్రతివారం తమను తాము కాపాడుకోవడానికి కంటెస్టెంట్లు తమ జీవితంలో ఉన్న రహస్యాలను ప్రేక్షకుల ఎదుట బయటపెట్టాలి. ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్లు తమ రహస్యాలను బయటపెట్టి అందరికి షాక్ ఇచ్చారు. ఇక తాజాగా మోడల్ కమ్ నటి మందనా కరిమి తన జీవితాల్లోని అతి పెద్ద రహస్యాన్ని చెప్పి కంటెస్టెంట్లతో పటు అభిమానులకు కూడా…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా రష్మిక ప్రధాన పాత్రలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏ.ఎం రత్నం సమర్పణలో భారీ బడ్జెట్ తో ఏ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకొంటున్న ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక నేడు శ్రీరామనవమి పండగను పురస్కరించుకొని ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ…
ఏదైనా శుభకార్యం ఆరంభించే ముందు ‘శ్రీరామజయం’ అని రాయడం తెలుగువారికి ఓ సంప్రదాయం. అదే తీరున తెలుగు చిత్రసీమలోనూ శ్రీరామనామమే విజయగీతం పాడించింది. మన భారతదేశంలో రూపొందిన తొలి టాకీ చిత్రంగా ‘ఆలమ్ ఆరా’ నిలచింది. ఈ సినిమా 1931 మార్చి 14న విడుదలయింది. మంచి విజయం సాధించింది. అందువల్ల ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు దక్షిణాదిన కూడా ఓ సినిమా నిర్మించాలని సంకల్పించారు. ఆ సంకల్పానికి ఆయన అసోసియేట్ గా ఉన్న తెలుగువారయిన హెచ్.ఎమ్.రెడ్డి కూడా…