ఇండియన్ ఆర్మీకి నటుడు సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానిపై ఆయన స్పందించారు. సుమన్ మాట్లాడుతూ “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే… వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను” అని తెలిపారు.
నటసింహ నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ యన్బీకే టాక్ షో వినోదాల విందుగా మారింది. ఇప్పటి దాకా తొమ్మిది ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది అన్ స్టాపబుల్. త్వరలోనే మహేశ్ బాబు అతిథిగా పదవ ఎపిసోడ్ ప్రసారంతో ఫస్ట్ సీజన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ వినోదాల విందులోని కొన్ని ముఖ్యఘట్టాలను ఏర్చి కూర్చి ప్రేక్షకులను ఆనందసాగరంలో ముంచెత్తడానికి ఆహా బృందం ఓ పథకం వేసింది. అందులో భాగంగా ఇప్పటి…
జి. ఎం.ఎస్. గ్యాలరీ ఫిల్మ్స్ బ్యానర్ పై జి. ఎం సురేష్ నిర్మాత గా మను పి.వి. దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘స్వ’. మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కరణం శ్రీరాఘవేంద్ర సంగీతాన్ని సమకూర్చారు. సినిమా గురించి నిర్మాత సురేశ్ మాట్లాడుతూ, ”ఇప్పటికే మూవీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటుంటోంది. నిన్న ‘కన్నుల్లోన…’…
జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. గత యేడాదిన్నరగా ఇదిగో అదుగో అంటూ ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా మొత్తానికి జనవరి 28న జనం ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నగేశ్ కుకునూరు దర్శకత్వంలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పకుడు కావడం విశేషం. తెలంగాణ మారుమూల పల్లెలోని లంబాడీ యువతి సఖి (కీర్తి సురేశ్). ఆమె ఏం…
రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడంటే వివాదాలతో ఫేమస్ అయ్యాడు కానీ.. అప్పట్లో వర్మ తీసిన సినిమాలు ఏ డైరెక్టర్ తీయలేదనే చెప్పాలి. హార్రర్ చిత్రాలు తీయడంలో వర్మ తరువాతే ఎవరైనా.. వర్మ తీసిన దెయ్యం సినిమా ఇప్పుడు 3డీలో హర్రర్ సినిమాలు చూస్తున్నవారికి చూపిస్తే జడుసుకోక మానరు. జెడి చక్రవర్తి, మహేశ్వరి, జయసుధ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో భారీ విజయాన్ని అందుకొంది. అయితే ఆ సమయంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్…
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు హీరోయిన్ మాత్రమే కాలేదు కానీ అమ్మడికి హీరోయిన్ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అందాల ఆరబోత దగ్గర నుంచి బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ వరకు ఐరా అన్నింటిలోను ఓపెన్ మైండెడ్ గా ఉంటుంది. గతకొంత కాలంగా తండ్రి అమీర్ ఖాన్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ షిఖరేతో ఐరా పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేసింది. ఇక ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన ఈ బ్యూటీ.. ఊ అంటావా ఊఊ అంటావా అంటూ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ఇక మరోసారి అమ్మడు ఐటెం సాంగ్ కి సిద్దమైందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న…
ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడిగా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ రెండవ చిత్రమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన విషయం విదితమే. ఆర్ఆర్ఆర్ పోస్టుపోన్ కావడంతో దాన్ని పక్కన పెట్టేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో రెండో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇది కాకుండా…