బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు హీరోయిన్ మాత్రమే కాలేదు కానీ అమ్మడికి హీరోయిన్ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అందాల ఆరబోత దగ్గర నుంచి బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ వరకు ఐరా అన్నింటిలోను ఓపెన్ మైండెడ్ గా ఉంటుంది. గతకొంత కాలంగా తండ్రి అమీర్ ఖాన్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ షిఖరేతో ఐరా పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తండ్రి తో పాటు నుపూర్, కూతురు కూడా ట్రైనింగ్ ఇవ్వడం, అతడి మనస్సు నచ్చి అతడిప్రేమలో అమ్మడు పడిపోవడం అన్ని వెంటవెంటనే జరిగిపోయాయి. ఏ విషయాన్నీ దాచని ఐరా ఈ విషయాన్ని కూడా అందరితో పంచుకుంది.
నుపూర్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఈ బ్యూటీ ఆ తరువాత బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఇక తాజాగా మరోసారి బాయ్ ఫ్రెండ్ తో హాట్ రొమాన్స్ చేస్తూ కనిపిచింది. చీరకట్టులో అందాలను ఆరబోస్తున్న ఐరాను అమాంతం వెనకనుంచి చుట్టేసి నుపూర్ రొమాంటిక్ పోజ్ లో కనిపించాడు. ఇక ఈ ఖాదీ కాటన్ చీరను నుపూర్ తల్లి గిఫ్ట్ ఇచ్చినట్లు ఐరా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టినట్ వైరల్ గా మారాయి. మరి త్వరలోనే వీరిద్దరూ జంటగా మారాలని కోరుకుంటున్నట్లు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.