రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడంటే వివాదాలతో ఫేమస్ అయ్యాడు కానీ.. అప్పట్లో వర్మ తీసిన సినిమాలు ఏ డైరెక్టర్ తీయలేదనే చెప్పాలి. హార్రర్ చిత్రాలు తీయడంలో వర్మ తరువాతే ఎవరైనా.. వర్మ తీసిన దెయ్యం సినిమా ఇప్పుడు 3డీలో హర్రర్ సినిమాలు చూస్తున్నవారికి చూపిస్తే జడుసుకోక మానరు. జెడి చక్రవర్తి, మహేశ్వరి, జయసుధ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా ఆ రోజుల్లో భారీ విజయాన్ని అందుకొంది. అయితే ఆ సమయంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని హీరోయిన్ మహేశ్వరీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
” దెయ్యం షూటింగ్.. ఒక పాడుబడ్డ ఫామ్ హౌస్ లో జరిగింది. అక్కడ ప్రదేశాలు చూస్తే వెన్నులో వణుకు పుట్టేది. అక్కడ రెండు నెలలు షూటింగ్ చేశాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ షూటింగ్ పెట్టేవారు. మెయిన్ రోడ్ నుంచి లోపలి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు లోపలికి రావాలి. కారు వెళ్లే సందు తప్ప మిగతా అంత చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఒకరోజు తెల్లవారు జామున 1 గంటకి షూట్ అని చెప్పారు వర్మ,. అందరు అక్కడికి చేరుకొని సీన్ చెప్తారని వెయిట్ చేస్తున్నాం. అంతలోనే వర్మ.. మీకు దమ్ముంటే ఈ సమయంలో ఆ రోడ్ లో వెళ్ళండి. వెళ్లినవారికి రూ. 50 వేలు ఇస్తాను అని పందెం కట్టారు. ఎవరు నోరు మెదపలేదు. నేను వెళ్తాను అని చెప్పగానే వర్మ ఆశ్చర్యపడి.. నువ్వు వెళ్తావా..? అని నవ్వారు. వెంటనే నేను వెళ్లి మళ్లీ రిటర్న్ వచ్చి వర్మను ఓడించాను. కానీ, ఆయన ఇస్తానన్న రూ. 50 వేలు ఇప్పటికి ఇవ్వలేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా వర్మ, హీరోయిన్ కి డబ్బులు ఇవ్వకపోవడం అనేది తప్పు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు