టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి ‘భామాకలాపం’ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 11 న ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ఇక భామాకలాపం గురించి ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ” నేను టాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేశాను. సవాల్ విసిరే పాత్రల్లో నటించాను. ఇక తాజాగా ‘భామాకలాపం’ తో…
గాన కోకిల లతా మంగేష్కర్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మృతితో సంగీత ప్రపంచం మూగబోయిందనే చెప్పాలి. ఎంతోమంది సంగీత అభిమానులు లతాజీ మృతిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే లతాజీ మృతి తర్వాత అందరిని తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయి. సుమారు రెండు వందల కోట్ల ఆస్తులకు లతాజీ యజమానురాలు. ఎంతో కష్టపడి సంపాదించిన ఆ ఆస్తులను అనుభవించడానికి ఆమెకు వారసులు లేరు. ఎందుకంటె ఆమె వివాహం చేసుకోలేదు, కనీసం…
అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తొలిసారి కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బడే మియా చోటే మియా’. ఇదే టైటిల్ తో బిగ్ బి అమితాబ్, గోవిందాతో 1998లో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించిన విషు భగ్నాని ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఏకంగా దీని బడ్జెట్ ను రూ. 300 కోట్లకు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అలనాటి ‘బడే మియా చోటే మియా’లో అమితాబ్, గోవింద ఇద్దరూ ద్విపాత్రాభినయం చేశారు. డేవిడ్…
పసిమి ఛాయ, చారెడేసి కళ్ళు, కొనదేలిన ముక్కు, దొండపండులాంటి పెదాలు, ఇలా వర్ణించుకుంటూ పోతే మౌనుల నిగ్రహానికి సైతం పరీక్ష పెట్టే విగ్రహం వై.విజయ సొంతం. తెరపై వై.విజయను చూడగానే ‘పులుసు’ అంటూ కేకలు వేసేవారు జనం. “మంగమ్మగారి మనవడు, మా పల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య” చిత్రాల్లో చేపల పులుసు చేయడంలో తనకు తానే సాటి అని చెప్పుకొనే పాత్రలో కనిపించారు వై.విజయ. అప్పటి నుంచీ ఆ పేరుతోనే ‘పులుసు’ విజయగా జనం మదిలో నిలచి…
బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ సరయుపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సరయు అందులో బోల్డ్ వర్డ్స్, బోల్డ్ కంటెంట్ తో బాగా ఫేమస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ఇక గతేడాది చివర్లో సరయు స్నేహితురాలు రాజన్న సిరిసిల్ల లో ఒక రెస్టారెంట్ ని ఓపెన్ చేసింది. ఆ రెస్టారెంట్ ప్రమోషన్ వీడియోలో సరయు తన అందచందాలతో ఆడిపాడింది. అయితే ఆ వీడియోలో గణపతి…
కోలీవుడ్ ప్రేమ జంట నయనతార- విఘ్నేష్ శివన్ ప్రస్తుతం విరహవేదనలో ఉన్నారు. ఇద్దరు తమ తమ పనుల్లో బిజీగా వేరోచోట ఉండడంతో విఘ్నేష్, ప్రియురాలిని బాగా మిస్ అవుతున్నాడట. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెల్సిందే. దీంతో పెళ్ళికి ముందే వీరిద్దరూ కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్‌ను ప్రారంభించి మంచి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక విఘ్నేష్ ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినా నయన్ పక్కనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ప్రియురాలిని వెంటతీసుకెళ్లకుండా వెళ్లాడు…
టాలీవుడ్ లో అందం అభినయం ఉన్న హీరోయిన్లు చాలామంది ఉన్నా కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల మనస్సులో కొలువై ఉంటుంది. అలాంటి హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. అందం, అభినయం కలబోసినా ఈ ముద్దుగుమ్మ పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ కోసం బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచి గ్లామర్ షో కు దూరంగా ఉన్న మీరా సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్…
నవతరం ప్రేక్షకుల నాడిని పట్టి కథలు వినిపిస్తున్న మేటి రచయిత ఎవరంటే ఇప్పట్లో విజయేంద్రప్రసాద్ పేరునే చెబుతారు జనం. తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన బాహుబలి సీరిస్ విజయేంద్రప్రసాద్ కలం నుండే చాలువారింది. ఆయన రచనలతో అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, హిందీ భాషల్లోనూ విజయేంద్రప్రసాద్ రచనలు జనాన్ని మెప్పించాయి. విజయేంద్రప్రసాద్ రచనలతో తెరకెక్కే సినిమాల కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. విజయేంద్రప్రసాద్ పూర్తి పేరు కోడూరి…