మరో ఐటెంసాంగ్ లో సమంత.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేసింది. ఇక ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన ఈ బ్యూటీ.. ఊ అంటావా ఊఊ అంటావా అంటూ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ఇక మరోసారి అమ్మడు ఐటెం సాంగ్ కి సిద్దమైందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాలో సామ్ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ సాంగ్ కోసం సామ్ గట్టిగానే పారితోషికం తీసుకోనున్నదట.
స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. పూరి ఐటెం సాంగ్స్ అంటే ఎలా ఉంటాయో మాటల్లో చెప్పక్కర్లేదు. ఊర మాస్ హీరో.. మాస్ మసాలా లిరిక్స్ తో మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉంటాయి. ఇక పుష్ప సాంగ్ తో సామ్ మాస్ లుక్స్, అందచందాలతో అదరగొట్టింది. ఇక విజయ్ దేవరకొండ పక్కన, పూరి డైరెక్టన్ లో సామ్ సాంగ్ అంటే అంతకు మించి ఉంటుందని అర్ధం అవుతుంది. అయితే ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలి అంటే మేకర్స్ నోరువిప్పాల్సిందే..
Also Read
తాజావార్తలు
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
-
India Tractor Sales: ఒక్క నెలలో 83,000 ట్రాక్టర్లు సేల్.. ఈ బ్రాండ్ కే జై కొట్టిన రైతులు
-
Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్‌పై దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!