Job Opportunity: దేశంలోని టెలికాం రంగంలో త్వరలో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు రానున్నాయి. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ కంపెనీలు త్వరలో తమ ఉద్యోగులను 25 శాతం వరకు పెంచుకోనున్నాయి.
ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు సహా 14 రాష్ట్రాల్లోని 50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ బుధవారం పార్లమెంట్‌కు తెలిపారు.