తెలంగాణ ఆర్టీసీ కారుణ్య నియామకాలకు గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల ఉత్తర్వులను తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ జారీ చేశారు. సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలు కొన్నేళ్లుగా కొలువుల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే డ్యూటీ చేస్తు గుండెపోటు లేదా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబాలనికి ముందుగా కొలువులివ్వాలని నిర్ణయించింది. గ్రేడ్ 2 డ్రైవర్ పోస్టుకు రూ. 19,000లు, కండక్టర్ గ్రేడ్ 2 పోస్టుకు రూ.17,000లు, ఆర్టీసీ కానిస్టేబుల్…
రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని ఈసీ.. కేంద్రన్యాయ శాఖను కోరిన విషయం తెలిసిందే. కానీ.. కేంద్రం నుంచి రిప్లై రాకముందే రంగంలోకి దిగింది ఈసీ.. రాష్ట్రంలో లోని 119 రాజకీయ పార్టీలకు ఈసీ నోటీసులు జారీచేసింది. రాజకీయ పార్టీల ఆదాయ ఖర్చులపై ఈనెలాఖరు వరకు సమాధానం ఇవ్వాలని సూచించింది. ఒకవేళ సమాధానం ఇవ్వలేని పక్షంలో వారి పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని వెల్లడించింది. ఈసీ నోటీసులు ఇచ్చిన పార్టీలో జనసేన,…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదం చిక్కుకున్నారు.. ఆయన హైదరాబాద్ శివారులో కోడిపందాల్లో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నగర శివార్లలో కోడిపందాల దగ్గరకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్.. పోలీసులు రాగానే చల్లగా జారుకున్నారు. అయితే, కోడిపందాల్లో తాను లేనంటూ సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు.. కానీ, దీనికి ఓ వీడియోతో కౌంటర్ ఇచ్చారు పోలీసులు.. ఘటనా స్థలంలో చింతమనేని ప్రభాకర్ ఉన్న వీడియోను విడుదల చేశారు..…
వరంగల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందడి చేసింది. ఈ ఛాలెంజ్లో కాకతీయ 22వ వారసుడైన కమల్ చంద్రభంజ్ దేవ్ పాల్గొని, స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల పాలనలో తమ పూర్వీకులు ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, అందులో భాగంగానే గొలుసు చెరువులు తవ్వించారని చెప్పారు. అడవుల్ని రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఆ ఒరవడి కేసీఆర్…
రాష్ట్రంలో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించుకున్న బీజేపీ.. విభజన చట్టంలోని హామీల్ని నెరవేరుస్తుందని భావిస్తే, దానికి బదులుగా తెలంగాణపై దండయాత్ర చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు, ఇచ్చిన తర్వాత కూడా ప్రధాని మోదీ రాష్ట్రాన్ని అవమాన పరిచారన్నారు. అసలు బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉందన్న విషయం.. ఈ సమావేశాలతో తేలిందన్నారు. ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వం మోసం చేస్తోందని…
తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. పార్టీలో ఉండే నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టొద్దని సూచించిన ఆయన.. నా అభిమానులు ఎవరు అలా చేసినా పార్టీలో ఉండరు అని హెచ్చరించారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుస్తుందని.. పార్టీ సర్వేలో అదే తేలిందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ను ఢీకొట్టే పరిస్థితి బీజేపీకి ఏమాత్రం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో మంత్రులుగా చేసిన కొందరు కోట్లు సంపాదించారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్లు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అలాంటి వాళ్లకు తాము బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పార్టీ బలమే కార్యకర్తలని వెల్లడించారు.…
వంట నూనెల ఎంఆర్పీని 10 రూపాయలు తగ్గించాలన్న కేంద్రం ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల రేట్లు దిగొచ్చిన నేపథ్యంలో వాటి గరిష్ట చిల్లర ధరను ఆ మేరకు సవరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దిగుమతి చేసుకునే నూనెల ఎంఆర్పీని 10 రూపాయలు తగ్గించాలని అడిగింది. మన దేశం వంట నూనెల వినియోగంలో 60 శాతానికి పైగా సరుకును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రూపాయి విలువను పెంచేందుకు చర్యలు ప్రకటించిన ఆర్బీఐ ఈ ఏడాది…