రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని ఈసీ.. కేంద్రన్యాయ శాఖను కోరిన విషయం తెలిసిందే. కానీ.. కేంద్రం నుంచి రిప్లై రాకముందే రంగంలోకి దిగింది ఈసీ.. రాష్ట్రంలో లోని 119 రాజకీయ పార్టీలకు ఈసీ నోటీసులు జారీచేసింది. రాజకీయ పార్టీల ఆదాయ ఖర్చులపై ఈనెలాఖరు వరకు సమాధానం ఇవ్వాలని సూచించింది. ఒకవేళ సమాధానం ఇవ్వలేని పక్షంలో వారి పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని వెల్లడించింది. ఈసీ నోటీసులు ఇచ్చిన పార్టీలో జనసేన, తెలంగాణ జన సమితి, లోక్ సత్తా, తెలంగాణ ఇంటిపార్టీ, నవ తెలంగాణ, ప్రజాశాంతి, తెలంగాణ తల్లి, సమాజ్ వాదీ ఫార్వర్డ బ్లాక్, జై స్వరాజ్, జనరాజ్యం, మన తెలంగాణ పార్టీలు ఉన్నాయి. ఈనెలాఖరులోగా సంబంధిత వివరాలు అందించాలని ఆపార్టీలకు పేర్కొంది.
read also: India vs England : దుమ్ములేపిన హర్దిక్ పాండ్యా.. భారత్ ఘన విజయం
ఏదో ఒక చిరునామాతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించడం, ఎన్నికల్లో గుర్తుపై పోటీ చేయడం తరువాత కనుమరుగైపోయిన దేశంలో 198 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేసినట్లు ఈసీ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 8 జాతీయ పార్టీలు.. 57 ప్రాంతీయ పార్టీలున్నట్లు ఈసీ తెలిపింది. అయితే ఇంకా 2796 గుర్తింపు లేని రాజకీయ పార్టీలున్నట్లు స్పష్టం చేసింది. కానీ.. అడ్రస్ లేని, ఖర్చుల వివరాలు చూపించకుండా దేశవ్యాప్తంగా నమోదైన 198 గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే.. రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు అందుకున్న విరాళాలకు సంబంధిత దేశ వ్యాప్తంగా 2017 నుంచి 2018లో 1,897 ఆర్ యూపీపాలు, 2018 నుంచి 19 లో2,202, 19,20లో 2,351, 2020,21లో 2794 ఆర్ యూపీపీలు కమిషన్ కు వివరాలు అందించలేదని పేర్కొంది. విరాళాల వివరాలు సమర్పించకుండా ఆదాయ పన్ను మినహాయింపు పొందిన 66 గుర్తింపు పొందిన పార్టీల సమాచారాన్ని కూడా ఈసీ సేకరించారని తెలిపారు. కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే పార్టీలను రిజిస్టర్ చేస్తున్నారని ఈసందర్భంగా ఈసీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
India vs England : దుమ్ములేపిన హర్దిక్ పాండ్యా.. భారత్ ఘన విజయం