తాము నిరక్షరాస్యులం ఏమీ కాదని.. బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ గురించి తెలుసు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పక్క రాష్టాల్లో రిజర్వేషన్లను న్యాయస్థానాలు కొట్టి వేసాయని, తమ్మల్ని మోసం చేయాలని చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం అవసరం అయితే కర్నాటక వెళ్లి సీఎం సిద్ధ రామయ్యతో చర్చిస్తాం అని పేర్కొన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్లు జరుగుతున్నాయని.. మరి వాటికి బీసీ రిజర్వేషన్ల జీవో ఎందుకు ఇవ్వలేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.…
Telangana AP water row on Banakacherla Project: ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు ససేమిరా అంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బనకచర్లపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది. ఇప్పటి వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ సర్కార్ లేఖలో ప్రస్తావించింది. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలో…
కొల్చారం (మం) వరిగుంతం గ్రామ శివారులో మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మెదక్- జోగిపేట రోడ్డు పక్కన కారులో అనిల్(45) మృతదేహం పడి ఉంది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో నాలుగు బుల్లెట్లు లభ్యమయ్యాయి. మొదట రోడ్డు ప్రమాదం అని భావించిన పోలీసులు బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Also Read:Promotions…
Promotions : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ పరిధిలో పనిచేస్తున్న 81 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ పదోన్నతులు లభించాయి. సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఈ పదోన్నతులను అధికారికంగా ప్రకటిస్తూ, ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి పరీక్షల నియంత్రణాధికారి జయప్రదా బాయి, మెదక్, రంగారెడ్డి జిల్లాల డీఐఈఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ, పదోన్నతి పొందిన లెక్చరర్లను శుభాకాంక్షలు తెలియజేశారు. Off…
పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు, సహజీవనాలు భార్యాభర్తల మధ్య చిచ్చుపెడుతున్నాయి. కుటుంబాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. తన భార్యతో గొడవపడుతుందని తనతో సహజీవనం చేస్తున్న మహిళను అంతమొందించాడు ఓ ప్రియుడు. కొనిజర్ల మండలం విక్రమ్ నగర్ లో భార్యతో గొడవ పడుతుందని సహజీవనం చేస్తున్న మహిళను లక్ష రూపాయలు సుపారి ఇచ్చి ప్రియురాలిని హత్య చేయించాడు. Also Read:NBK : బి. సరోజా దేవి మృతి పట్ల బాలయ్య సంతాపం…