శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.. ఇన్ ఫ్లో రూపంలో 1,48,696 క్యూసెక్కుల నీరు వచ్చి డ్యామ్‌లో చేరుతుండగా.. మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం.. 882.80 అడుగులుగా ఉంది.. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 203.4290 టీఎంసీలుగా ఉంది..
Tragedy: మద్యానికి బానిసైన కన్నతల్లి ముక్కు పచ్చలారని కన్న కూతురినే కడతేర్చింది. అభం శుభం తెలియని బోసి నవ్వుల చిన్నారిని దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది. హృదయాన్ని కలిచివేసే ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఇక్కడ చూడండి.. ఇక్కడ బెడ్‌పై తాపీగా కూర్చున్న మహిళ పేరు రమ్య. ఈమెకు నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పులకు చెందిన గంగోని మల్లేష్‌తో 2 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం అమ్మాయి…
Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను త్వరలో జారీ చేయాలని యోచిస్తోంది. ఇదే కారణంగా రాష్ట్ర అసెంబ్లీని ప్రోరోగ్ చేసినట్లు సమాచారం. అలాగే ప్రత్యేక అసెంబ్లీ…
KA Paul: బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ లాంటి 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు ఈడీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాశస్త్యం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ...రెండు రాష్ట్రాల మధ్య ఉన్న, నలుగుతున్న ఆలయ భూముల గురించి మాత్రం రామయ్య భక్తగణంలో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైఖరి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అందుకే నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగవేయాలన్న ప్లానింగ్‌లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును ఎలాగైనా కొట్టాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తుంటే..
Drugs Party In Hyderabad: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగిల్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. 9 పబ్స్ పైన ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. ఇప్పటికే, పబ్బుల యజమానులకు నోటీసులు జారీ చేసింది.