Munugode Bypoll: సమయం ఆసన్నమైంది.. రేపటి నుంచే మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode Bypoll: తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలు కొంత కాలంగా ఎదురుచూస్తోన్న మునుగోడు ఉప ఎన్నికకు సమయం రానే వచ్చింది. రేపటి నుంచి మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్లు షురూ కానున్నాయి. అయితే..టీఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించక పోవడం చర్చకు దారితీస్తోంది. ఇవాళ మునుగోడుకు మంత్రులు, ఎమ్మెల్యేలు.. మునుగోడు నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా టీఆర్ఎస్ విభజించింది. ఒక్కో యూనిట్ బాద్యతలను ఒక్కో బృందానికి అప్పగించింది.
అక్టోబర్ 3న మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీ మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఈసీ షెడ్యూల్‌లో వెల్లడించింది. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనున్నట్టు పేర్కొంది. బీహార్‌లోని రెండు స్థానాలకు, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశాలోని ఒక్కో అసెంబ్లీ స్థానంతో పాటు తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి షెడ్యూల్ ప్రకటించి ఈసీ. ఆ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా అక్టోబర్ 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండగా, నామినేషన్ల ఉపసంహరణకు 17వ తేదీ గడువుగా పెట్టారు. ఇక, నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా నవంబర్ 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. నవంబర్ 8వ తేదీతో ఉప ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుందని ఈసీ పేర్కొంది.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
Read also: Rahkeem Cornwall: టీ20ల్లో వరల్డ్ రికార్డ్.. 77 బంతుల్లోనే డబుల్ సెంచరీ
ఇప్పటికే మునుగోడుపై కేంద్రీకరించి పనిచేస్తున్నాయి ప్రధాన పార్టీలు… సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నికలు వస్తుండగా, ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కమలం పార్టీ తీర్థం పుచ్చుకొని ఈ సారి పువ్వు గుర్తుపై అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. కేంద్ర మంత్రి అమిత్‌షాను పిలిచి భారీ బహిరంగసభ కూడా నిర్వహించారు. మరోవైపు, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీగా గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసి.. విస్తృతంగా ప్రచారంలో మునిగిపోయింది.. పల్లె పల్లెలో కార్యక్రమాలు, పాదయాత్రలు, అగ్రనేతల టూర్లు సాగుతున్నాయి.. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అంటూ.. హస్తం పార్టీ కూడా పెద్ద ఎత్తున ప్రజానికంతో బహిరంగ సభ నిర్వహించింది. ఇక, ఆ రెండు పార్టీలు కాదు.. ఈ సారి విజయం మాదేనంటూ నమ్మకం వ్యక్తం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించకపోయినా మంత్రి జగదీష్ రెడ్డి బాధ్యతలను తన బుజాలపై వేసుకుని విస్తృతంగా పర్యటిస్తున్నారు. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ను పిలిచి భారీ సభ నిర్వహించినా అభ్యర్థిని ప్రకటించలేదు. షెడ్యూల్ విడుదల కావడంతో.. ఏ క్షణంలోనైనా టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో టాక్. మునుగోడు అభ్యర్థిని టీఆర్‌ఎస్ ఎవరిని ప్రకటించనుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
No charges for credit card use: క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక, ఛార్జీలు లేవు..!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!