Bharat Rashtra Samithi: బీఆర్ఎస్‌పై కేసీఆర్ ప్రకటన ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్‌ఎస్).. ఇప్పుడు భారత్ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్)గా మారిపోయింది… తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం.. ప్రతినిధులు దానికి ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. ఇక, ఈ సందర్భంగా చేసిన తీర్మానాన్ని.. సమావేశం చివరల్లో చదివి వినిపించారు గులాబీ పార్టీ చీఫ్ కె.చంద్రశేఖర్ రావు.. భారత్ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అక్టోబర్ 5వ తేదీ 2022న హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది… టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి పార్టీగా మారుస్తూ ఏకగీవ్రంగా తీర్మానం చేసింది… ఇక, బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అంటూ చేసిన తీర్మానాన్ని చదివి వినిపించారు.. ఇక, ఆ తీర్మానంపై సంతకం చేశారు కేసీఆర్.. పలు రాష్ట్రాల నేతల సమక్షంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు.
Read Also: KCR National Party: టీఆర్ఎస్.. ఇక బీఆర్ఎస్..
Also Read
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
ఇక, ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యిందని ఆరోపణలు గుప్పించిన ఆయన.. తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాలని పిలుపునిచ్చారు.. బంగ్లాదేశ్ కంటే భారత్ వెనకపడటం ఎంటి ? అని ప్రశ్నించారు.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) జైత్రయాత్రను మహారాష్ట్ర నుంచి మొదలు పెడదామని వ్యాఖ్యానించారు.. కర్ణాటకలో మన జెండా ఎగరాలి.. అఖిలేష్ యాదవ్ ఈ సమావేశానికి రావొద్దని చెప్పాం.. ఎందుకంటే వాళ్ల నాన్న ములాయం సింగ్ ఐసీయూలో ఉన్నారని తెలిపారు.. అందరూ కలిసి వస్తారు.. బీఆర్ఎస్ సత్తా చాటుతుందన్నారు కేసీఆర్. ఈ సమావేశంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు.. మరికొన్ని రాష్ట్రాల నుంచి నేతలు హాజరైన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
-
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
-
Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!