కాంగ్రెస్‌కు ఆపార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. 8 పేజీల రాజీనామా లేఖను సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపారు. చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో బంధం తెంచుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ నిందితులు దొరికిపోయిన కేసులో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. ఈ కేసులో, ఆడియో టేపులు, వీడియో ఫుటేజ్ ఇప్పటికే హల్ చల్ చేస్తోంది.. దేశంలోని అన్ని కోర్టులకు, వ్యవస్థలకు, పార్టీలకు, ప్రముఖులకు సైతం.. ఆ వివరాలను పంపించారు తెలంగాణ సీఎం కేసీఆర్.. మరోవైపు.. ఈ కేసును పూర్తిస్థాయిలో తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేశారు.. హైదరాబాద్ పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్…
తెలంగాణలో బీజేపీకి ఉన్నది 5 శాతం ఓటింగ్ మాత్రమే… రాష్ట్రంలో టీఆర్ఎస్కి అసలైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత మహేశ్వర్‌రెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పార్టీలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు.. మర్రి శశిధర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. పార్టీ మీద ఆయన చేసిన కామెంట్స్ క్షమించలేనివి.. కానీ, మర్రి శశిధర్ రెడ్డికి నోటీసులు ఇచ్చే పరిధి ఏఐసీసీది అన్నారు.. బయటకు వెళ్లివాళ్లను…
ఇప్పుడు దేశ ప్రజలందరి చూపు తెలంగాణ సీఎం కేసీఆర్ పైనే ఉంది.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రభుత్వ ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్.. హనుమకొండ జిల్లా మడికొండలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.. ఈ సమ్మేళనంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్, కార్పొరేటర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మా…
హైదరాబాద్ పాతబస్తీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.. చార్మినార్ దగ్గర బాంబు పెట్టామంటూ ఆగంతకులు బెదిరించారు.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. చార్మినార్ దగ్గరకు చేరుకున్నారు.. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.. దాదాపు గంటకు పైగా తనిఖీలు నిర్వహించారు.. మరోవైపు.. బాంబు బెదిరింపు నేపథ్యంలో.. చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని పుట్‌పాత్‌లపై వ్యాపారులను ఖాళీచేయించారు పోలీసులు.. కాగా, నిత్యం చార్మినార్, పరిసర ప్రాంతాలు రద్దీగా ఉంటాయి.. ఓవైపు చార్మినార్‌కు తరలివచ్చే సందర్శకులు.. మరోవైపు భాగ్యలక్ష్మి టెంపుల్‌కు వచ్చే భక్తులు.. ఇంకావైపు..…
తమను అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పెద్దలకు మొరపెట్టుకున్నారు తెలంగాణ నేతలు.. అసెంబ్లీ ఇంఛార్జి బాధ్యతల నుండి తప్పించండి అంటూ మరో సారి బండి సంజయ్, తరుణ్ చుగ్‌ను కోరారు.. అయితే, పోలింగ్ బూత్ కమిటీలు వేసే బాధ్యత అసెంబ్లీ ఇంఛార్జిలదేనని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.. ప్రతి బూత్ లో 22 మందితో కమిటీ వేయాల్సిందేనని.. లేకుంటే తప్పిస్తామని హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో తరుణ్ చుగ్…
ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు రేవంత్‌రెడ్డి.