హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది.. ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న దేవేందర్ కుమారుడిగా చెబుతున్నారు.. కొండాపూర్ సెంట్రల్ పార్క్ లోని ఇంట్లో తల్లి తండ్రులతో కలిసి ఉంటున్న అక్షయ్.. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.. యువకుని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నా.. ఓ పాత కేసు ఆత్మహత్యకు కారణంగా ప్రచారం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోర్డింగ్ కు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని దుర్గంచెరువులో తొలి వాటర్ స్కూల్‌ను ప్రారంభించింది. ఎనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు కయాకింగ్, సెయిలింగ్, విండ్సర్ఫింగ్ , స్టాండ్-అప్ పాడిల్ బోర్డింగ్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించిన వాటర్ స్కూల్, పిల్లలకు అనేక వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది.
What’s Today: • కర్నూలు: ఎమ్మిగనూరులో నేడు సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం.. హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ • సత్యసాయి జిల్లా: సత్యసాయి బాబా 97 వ జయంతి పురస్కరించుకుని నేటి నుంచి పుట్టపర్తిలో నారాయణ సేవ కార్యక్రమం • తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో నేటితో ముగియనున్న జాతీయ ఆయుర్వేద పర్వ్.. ప్రజల్లో ఆయుర్వేద వైద్యంపై అవగాహన పెంచేందుకు ఆనం కళాకేంద్రంలో జరుగుతున్న ఉత్సవం • ప్రకాశం: ఒంగోలు మండలం చేజర్లలో నూతనంగా…
తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం సృష్టించింది.. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ఆడియో టేపులు, వీడియో ఫుటేజ్ వైరల్‌గా మారిపోయింది.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నోటీసుల్లో గందరగోళం ఏర్పడింది.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన రెండో కొడుకు విశ్వజిత్ పెళ్లికి ఆహ్వానించడానికి ప్రధాన మంత్రి మోదీ కలిశామన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తనను ప్రధాని మోడీ ఎంతో ఆప్యాయంగా పలకరించారని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలువురు బీజేపీ ఎంపీ ఇంటిని సీజ్ చేశారు.
Telangana: ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వ విద్యార్థులు.. బడిలోనే బ్యాంకు ఏర్పాటు సాధారణంగా బ్యాంకులు రోజులో ఆరేడు గంటలు పనిచేస్తుంటాయి. కానీ ఈ బ్యాంక్ మాత్రం అరగంటే పనిచేస్తుంది. అదేంటి అనుకుంటున్నారా.. ఇది బడిలోని బ్యాంక్. ఇక్కడ స్కూల్ విద్యార్థులే ఉద్యోగులు. వాళ్లే ఇక్కడ బ్యాంక్ మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్, క్లర్క్. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్‌లోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయుల చొరవతో బడిలోనే బ్యాంక్ ఏర్పాటు చేసుకుని…