పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. వాయువ్య దిశగా గంటకు 5 కి.మీ వేగంతో కదులుతూ చెన్నెకి సమీపిస్తున్న వాయుగుండం. చెన్నైకి తూర్పున 140, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 225కి.మీ.దూరంలో కొనసాగుతుంది ఈ వాయుగుండం. తీరానికి సమీపించే కొద్దీ బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐ ఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి బలంగా వీస్తున్నాయి గాలులు. ప్రకాశం,నెల్లూరు,రాయలసీమ జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో బులెటిన్ వార్నింగ్ కొనసాగిస్తుంది ఐఎండీ.
రాబోయే 48 గంటల్లో.. తమిళనాడు, ఏపీ తీరానికి దగ్గరగా రానుందని తెలిపిన అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైయస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. అందువల్ల చేపలు పట్టేవారు.. సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం వుంది.
Read ALso: Foot Ball: సినిమాల్లో దుమ్మురేపిన ‘ఫుట్ బాల్’!
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా వర్షాలు పడుతున్నాయి. చెన్నై నగరంలో భారీ వర్షం కురిసింది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన చిన్న చిన్న అల్పపీడనాలన్నీ కలిసి వాయుగుండంగా మారాయి. ఇది చెన్నైకు 670 కి.మీ, కారైక్కాల్ ప్రాంతానికి 630 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర వైపు రానున్న 48 గంటల్లో పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌లో ఒకటి రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడింది. వర్షంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద ఇబ్బందులు పడుతున్నారు రైతులు.
విల్లుపురం, కడలూరు, తిరువణ్ణామలై, కాంచీపురం, రాణిపేట, తిరువళ్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తమిళనాడులో మంగళవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావం కారణంగా చెన్నై నగరంలో భారీ వర్షం కురుస్తుందని, అప్రమత్తంగా వుండాలని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా, కోస్తాంధ్ర తీరం, తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం, శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, అందువల్ల వచ్చే 24 గంటల పాటు జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళవద్దని వాతావారణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?