Marri Shashidhar Reddy: కాంగ్రెస్‌కు ఆపార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. 8 పేజీల రాజీనామా లేఖను సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు పంపారు. చాలా బాధతో కాంగ్రెస్ పార్టీతో బంధం తెంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పార్టీ విఫలం అయ్యిందని తెలిపారు. ప్రజల కమిట్ మెంట్ ని కాపడలేదని అన్నారు. ఇవాల్టి నుండి కాంగ్రెస్ హోం గార్డుగా ఉండటం లేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితిని ఊహించలేదని అన్నారు. తెలంగాణ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ కు చేతి గుర్తు సూచించిన వారిలో మా నాన్న ఉన్నారని అన్నారు. ఇలాంటి అనుభూతులు ఉన్న పార్టీని వీడుతున్నందుకు చాలా బాధగా ఉందని తెలిపారు. ఇందిరాగాంధీకి ఎంతో బలం చేకూర్చారు మా నాన్న అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కుమ్మక్కు అయ్యింది అన్నారు.ఉత్తమ్ పీసీసీ అయ్యాక అన్ని ఎన్నికల్లో ఒడిపోయామని సంచళన వ్యాక్యలు చేశారు.
Read also: Bholaa Teaser: సార్ ఇది ఖైదీ సినిమాలా లేదే…
ఆరేళ్ళు ఆయన్ని ఎలా కొనసాగించారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో దురదృష్టకర పరిణామాలతోటే ఉత్తమ్ ఆరేళ్ళు పీసీసీ గా కొనసాగారని మండిపడ్డారు. ఇన్చార్జిలు అందర్నీ సమన్వయ పరచాలని కానీ.. అప్పటినుంచి ఇప్పటివరకు ఇన్చార్జీలు పీసీసీలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. పీసీసీలకు ఏజెంట్లుగా ఇన్చార్జిలు పనిచేశారని తెలిపారు. బంగారు బాతుగా పీసీసీ లను భావిస్తున్నారని ఎద్దేవ చేశారు. ఇంచార్జి వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఇన్చార్జి మొదలుకుని.. వేణుగోపాల వరకు డబ్బు కీలకమైందని ఆరోపించారు. డబ్బులు తీసుకోవడం నేను చూడలేదు కానీ, వ్యవహారం చూస్తే అలాగే ఉందని సంచళన వ్యాఖ్యలు చేశారు. టైం ఆడిగితే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సోనియా గాంధీ కూడా నిస్సయకురాలు అయ్యారని తెలిపారు. ఉత్తమ్ భార్య ఓడిపోతే రాజీనామా చేశారని, ఉత్తమ్ చాలా మందికి నువ్వు పీసీసీ ట్రై చేసుకో అని చెప్పారని అన్నారు. అధిష్టనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి 17 మంది పేర్లు కుంతియా పంపారని ఆరోపించారు. అది ఉత్తమ్ ఎత్తుగడలో భాగమన్నారు.
Read also:Dharmana Prasada Rao: ఎందుకీ మాయమాటలు బాబూ!
2018 లో గెలిస్తే తన ఖాతాలో వేసుకోవచ్చు అని అనుకున్నారని ఆరోపణలు గుప్పించారు. చిదంబరం నాకు ఈ విషయం చెప్పారని అన్నారు. కేసీఆర్ క్యాబినెట్ లో రాజీనామా చేయకుండా తలసాని మంత్రి అయ్యారని ఆరోపించారు. అప్పుడు కనీసం ప్రొటెస్ట్ చేశారా? అంటూ ప్రశ్నించారు. 2020 లో పీసీసీ సెలక్షన్ ప్రాసెస్ చేశారు. ఎవర ని సంప్రదించకుండా రేవంత్ ని పీసీసీ చేశారని మండిపడ్డారు. ఠాగూర్ ఏం చెప్పినా వినే పరిస్థితి లేదని అన్నారు. రేవంత్ తో ఎదో ఉద్దరిస్తారని హైప్ చేసుకున్నారని ఆరోపించారు. Dcc లకు నెలకు రెండు లక్షల ఇస్తా అన్నారు అని అంతా రేవంత్ కి జై అన్నారని మండిపడ్డారు. రేవంత్ వ్యవహారం సరిగా లేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకపేట ల్యాండ్ విషయంలో ఎంతో హడావుడి చేశారని గుర్తుచేశారు. కోకపేట ల్యాండ్ విషయంలో కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు.
Read also:Chhello Show: ఇండియా నుంచి ఆస్కార్ కి నామినేట్ అయిన మూవీ ఒటీటీలో వస్తోంది…
కానీ రేవంత్ సైలెంట్ గా ఉన్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 8న రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీకి వెళ్లారని, కోకపేట ల్యాండ్ పై సీబీఐ విచారణ చేయాలని సీబీఐకి లేక రాశాడని అన్నారు. ఆ తరవాత మళ్ళీ మాట్లాడలేదని ఆరోపించారు. రేవంత్ కి ఒకటి..రెండో విడత అందాయి అనుకున్నా.. ఆయన బ్లాక్ మైలర్ .. చీటర్ అంటూ మండిపడ్డారు. హుజురాబాద్ లో మూడు వేల ఓట్లు వస్తే ఎవరికి చీమ కుట్టినట్టు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందని, మునుగోడు డిపాజిట్ పోతే రేవంత్ కి సంతృప్తి చెందిన అంటారా? అంటూ ప్రశ్నించారు. వెంకట్ రెడ్డి కి తెలియకుండా మునుగోడులో సభ పెట్టారని గుర్తుచేశారు. దయాకర్ తో అలా మాట్లాడించడం సరికాదన్నారు. అప్పుడే కాంగ్రెస్ పతనం మొదలైందని అన్నారు. రేవంత్ పై నాకు వేరే ఉద్దశం లేదన్నారు. మంచి స్థాయికి చేరతాడు అనుకుంటున్న అని అన్నారు. కానీ బ్లాక్ మైలర్ గా మారితే ఏటో పోతాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మర్రి శశిధర్ రెడ్డి. అయితే కాంగ్రెస్ వీడిన ఆయన ఈనెల 25 లేదా 26న కాషాయి కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
Tollywood: ఈ వీకెండ్ మూవీస్ ఇవే!