నేడు సొంత జిల్లాకు సీఎం జగన్.. స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ తన సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు.. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న స్టీల్ ప్లాంట్‌కు ఇవాళ భూమిపూజ చేయనున్నారు.. సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంటుకు భూమిపూజ చేస్తారు. అలాగే పులివెందులలో ఓ శుభకార్యంలో పాల్గొననున్నారు.. కడప జిల్లా పర్యటన కోసం ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి ఉదయం 10.50…
తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. అనంతరం తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. త్వరలో ప్రజా సంగ్రామ యాత్ర పార్ట్ -2 మొదలవుతుందని తెలిపారు.
యూత్ ఫర్ యాంటీ కరప్షన్ జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం ఎర్రమంజిల్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సలహదారులు శ్రీనివాస్ మాధవ్, సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి పాల్గొన్నారు.
ఆ మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ జగన్ సీరియస్.. డెడ్ లైన్ పెట్టేశారు..! 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీరియస్ అయ్యారు. జూన్ 30లోపు పనితీరు మార్చుకోవాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే ఆ నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించాల్సి వస్తుందంటూ సంబంధిత ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గడప గడపకు కార్యక్రమంపై సోమవారం రోజు సీఎం వైఎస్ జగన్…
కేసీఆర్ కొండగట్టు పర్యటన రేపటికి వాయిదా.. షెడ్యూల్ ఇదే.. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని సీఎం కేసీఆర్ బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు. కానీ.. ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి మంగళవారం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో తన పర్యటనతో భక్తులకు ఇబ్బందులు కలగకూడదని భావించిన సీఎం తన పర్యటనను బుధవారం వాయదా వేసుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. రేపు ఉదయం సీఎం…
Strange Weather Condition: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలేమో ఎండ దంచేస్తోంది.. రాత్రైతే చలి వణికిస్తోంది. ఫిబ్రవరిలోనే.. సమ్మర్ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పగటిపూట 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు.. రాత్రికి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల్లో అత్యధిక హెచ్చుతగ్గులతో.. జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. చలి వణికిస్తోంది. దీంతో రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి జిల్లా కుంతలంలో 7.5, జీకే…