లోకేష్ ఒక బఫూన్… ఒక ఐరన్ లెగ్ అంకుల్
లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు మంత్రి ఆర్ కె రోజా. పుత్తూరులో జనం లేక కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి జనాన్ని తరలించారు. నా నియోజకవర్గం వారు లోకేష్ ని కొట్టటానికి రెడీ అయ్యారు…కానీ నేనే కొట్టద్దని అడ్డుకున్నాను. నేను జబర్దస్త్ ఆంటీ అయితే మీ అమ్మ హెరిటేజ్ ఆంటీ అనాలా.. నీ భార్యను హెరిటేజ్ పాప అనాలా అని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. దాదాపు ముప్పై ఏళ్ళు నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నాను…నీది అవినీతి సొమ్మా…నాది అవినీతి సొమ్మా అనేది సీబీఐ ఎంక్వరీ కి సిద్ధమా అని సవాల్ చేశారు. మీ నాన్న పొలంలో ఎర్రదుంగలు ఎలా వచ్చాయి అనేది ఇంక తేలలేదు. జగన్ కి నీకు చాలా తేడా ఉంది…జగన్ పులి అయితే నువ్వు పులకేశి…జగన్ జెండా అజెండా తో 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు…జగన్ కి తన నియోజకవర్గం లో ఇల్లు ఉంది..విజయవాడ ఇంట్లో ఉండి ప్రజా సమస్యలు తీరుస్తున్నాడు. నువ్వు మీ నాన్న దొంగల్లా వచ్చి పోతున్నారు…నిజంగా జగన్ నీముందుకు వస్తే గుండె ఆగి చస్తావ్…టెంట్లల్లో దాక్కుని సాయంత్రం వాక్ చేస్తున్నావ్ నువ్వు…పాదయాత్ర సక్రమంగా చేయలేక నువ్వు కూడా జగన్ ని విమర్శిస్తున్నావ్…ఇలానే విమర్శిస్తే నీకు బడితపూజ తప్పదన్నారు రోజా.
ఆదాయాలు తగ్గి, అప్పులు పెరగడం వల్లే ఇబ్బందులు
గతేడాదిలో పెండింగ్ బిల్లులు రూ. 40 వేల కోట్లు ఉన్నాయన్నారు ఆర్దిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ. అవి ప్రస్తుతం 21,673 వేల కోట్లకు తగ్గింది. కొంత మంది కాంట్రాక్టర్లు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారో.. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో తెలీదు. రూ. 40 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నప్పుడు అందులో చాలామంది ధనికులుగా ఉన్నారేమో? ఆ విషయాలకు నేను సమాధానం చెప్పలేను. బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్న కారణంగా రూ. 1.80 లక్షల కోట్లని ఎలా ప్రచారం చేస్తారు? టీడీపీ హయాంలో ఎన్ని బిల్లులు క్లియర్ అయ్యాయో నాకు తెలీదు. కొన్ని పెండింగులో ఉండి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ పరిస్థితుల కారణంగా వేతనాలు అలస్యమై ఉండవచ్చు. గతంతో పోలిస్తే ఆదాయాలు తగ్గాయి. ఎప్పుడూ లేనట్టుగా రూ. 1.92 లక్షల కోట్లు డీబీటీల ద్వారా చెల్లించాం. ఆదాయం తగ్గి, అప్పులు పెరిగి, సంక్షేమ పథకాల అమలు వల్ల కొన్ని సార్లు జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరగొచ్చు. జీఎస్టీ అమలైన తర్వాత రాష్ట్రానికి మొదట్లో ఆదాయాలు తగ్గాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. చాలా కారణాల వల్ల రాష్ట్రాల ఆదాయాల్లో రాజీ పడాల్సి వస్తోంది. అన్ని రాష్ట్రాల ద్రవ్యలోటుతో పోలిస్తే.. ద్రవ్యలోటు రూ. 25 వేల కోట్లకు దిగివచ్చిందన్నారు దువ్వూరి కృష్ణ.
దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధి
పల్నాడు జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. బౌద్ధమతం, సిక్కుఇజం, జైనిజం, హిందూయిజం నాలుగు మతాలు భారతదేశం పుట్టినిల్లు. దేశవ్యాప్తంగా స్పిరిట్యువల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నాం. స్వదేశీ దర్శన్ కింద 7 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దేశంలో 50 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రినిర్మలా సీతారామన్ బడ్జెట్ లో చెప్పారు. నాగార్జున కొండను అభివృద్ధి చేసే దిశగా చూస్తున్నాం. కాకినాడ వైల్డ్ లైఫ్ సెంచరీ, బుడమేరు, యశ్యానం, మైపాడ్ బీచ్, బౌద్దమత సర్కూట్, అమరావతి ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. అమరావతి లింగేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి 27.7 కోట్లు మంజూరు చేసాం. స్వదేశి దర్శన్ కింద 141 కోట్లు ఏపీకి ఇవ్వడం జరిగింది. ఏపీ టూరిజం శాఖ ద్వారా ఈ అభివృద్ధి పనులు కేంద్రం చేయిస్తుంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా టూరిజం శాఖ తీవ్రనష్టాలు వచ్చాయి. అదృష్టవశాత్తూ 2022 నుండి టూరిజం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ఎప్పుడూ లేనివిధంగా శ్రీనగర్ లో ఈ ఏడాది ఎక్కువ మంది టూరిస్టులు వచ్చారు. జీ20 భారత్ లో జరుగుతుంది, 29 దేశాల నుండి అన్ని శాఖల మంత్రులు, అధికారులు రాబోతున్నారు అన్నారు. 250 సమావేశాలు 56 నగరాల్లో జరగబోతున్నాయి, లక్షన్నల మంది డెలిగేట్స్ రాబోతున్నారు.
శభాష్ భరత్.. గోదావరిలో దూకబోయిన యువకుడిని కాపాడిన ఎంపీ
ఎంపీ అయి ఉండి శభాష్ అనిపించుకునే పనిచేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. గోదావరిలో దూకబోయిన యువకుడిని కాపాడారు ఎంపీ. ఆ యువకుడి హృదయానికి ఏమి గాయమైందో, ఏమి కష్టం వచ్చిందో తెలియదు కానీ తనువు చాలించాలనే కఠోర నిర్ణయానికి వచ్చాడు. అనుకున్నదే తడువుగా తన స్వగ్రామం ఉనకరమిల్లి (నిడదవోలు మండలం) నుండి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దూరంగా బైక్ పై రాజమండ్రి- కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెనపైకి చేరాడు. బైక్ ఒక పక్కన బెట్టి, ఒక్కసారిగా బ్రిడ్జి పై నుండి గోదావరిలో దూకేందుకు సిద్ధమయ్యాడు.సరిగ్గా అదే సమయంలో గోపాలపురంలోని ఒక శుభ కార్యక్రమానికి బయల్దేరిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ కంట ఈ దృశ్యం పడింది. అంతే ఆయన వాహనాన్ని ఆపేశారు. కారులో నుండి ఒక్క ఉదుటున దూకి, ఆ వెనువెంటనే ఆ యువకుని కాలర్ పట్టుకుని వెనక్కి లాగారు. ఆ తరువాత యువకుని జబ్బ పట్టుకుని గట్టు (ఫుట్ పాత్)పై నుండి రోడ్డు మీదకు బలంగా లాగారు. అంతే ఎంపీ అనుచరులు ఆ యువకుడిని పట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ఆ యువకుడు హతాశుడయ్యాడు. కొద్ది సేపటి వరకూ షాక్ నుండి తేరుకోలేకపోయాడు.
నిందితుడిని జైల్లో పెట్టుకుని.. వెతుకుతూనే ఉన్నారు
ఓ హత్య కేసులో నిందితుడిని పెట్టుకుని ఇరవై ఏళ్లుగా ముంబైపోలీసులు దేశమంతా వెతుకుతున్నారు. కానీ అతడు మరో కేసులో చిక్కుకుని జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. చోటా షకీల్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్ మహిర్ సిద్ధిఖీ కోసం ముంబై పోలీసులు 20 ఏళ్లుగా దేశమంతా గాలించారు. ఆ తర్వాత అతడు అండర్ ట్రయిల్ జైల్లో ఉన్నాడని తెల్సుకుని షాక్ తిన్నారు. పోలీసులే కాదు న్యాయమూర్తి ఏఎమ్ పాటిల్ కూడా షాక్ అయ్యారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. దీంతో ఈకేసును ‘అన్‌సాల్వ్‌డ్ మిస్టరీ’గా మారింది. గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ గ్యాంగ్‌కు చెందిన షార్ప్ షూటర్ మహిర్ సిద్ధిఖీ మరో వ్యక్తితో కలిసి 1999లో బాంబే అమన్ కమిటీ చీఫ్ వాహిద్ అలీఖాన్‌ను హత్యచేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సిద్థిఖీ కోసం గాలింపు మొదలుపెట్టారు. కానీ అతడి ఆచూకీ లభించలేదు. చివరికి 2019లో మే 29న అతడిని అరెస్ట్ చేశారు. చోటా షకీల్ ఆదేశాలతోనే సిద్ధిఖీ ఆ హత్య చేశాడని..ఇక అప్పటినుంచి పోలీసుల కళ్లు కప్పి తిరుగుతూ ఉన్న అతడిని అరెస్ట్ చేసినట్టు కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు విచారణను మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్ కేసుల ప్రత్యేక జడ్జి ఏఎం పాటిల్ చేశారు.
గండిపేట చెరువు సుందరీకరణ పనులు చేపట్టాలి
గండిపేట చెరువు సుందరీకరణ పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సి.ఎస్ శాంతి కుమారి. గండిపేట చెరువు అభివృద్ధి పనులు, సుందరీకరణ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి సమీక్ష చేశారు.సుందరీకరణలో భాగంగా మొదటి దశలో Walking Track, Cycling Track సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన , పనులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.గండిపేట చెరువు చుట్టు సుందరీకరణ పనులను చేపట్టుటకు తగిన ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. సుందరీకరణ పనులలో భాగంగా పార్క్ లను కూడా అభివృద్ధి పరచాలని సి.ఎస్ పేర్కొన్నారు. కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ అధికారులను ఆదేశించారు.
హిట్ కోసం గే మారిన హీరో
టాలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకొని గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. గతేడాది అల్లూరి వంటి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేపోయింది. దీంతో ఈసారి ఎలా అయినా శ్రీ విష్ణు మంచి హిట్ కొట్టాలని ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు ఈ హీరో తన కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాడు. వివాహా భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘సామజవరగమనా’. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు సరసన బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ నటిస్తోంది. నేడు ఈ సినిమాను రిలీజ్ చేస్తూ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. అయితే ఈ సినిమా కోసం శ్రీ విష్ణు ఒక పెద్ద రిస్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఈ హీరో గే పాత్రలో కనిపిస్తున్నాడట. ఆ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండడంతో కాదనకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఒకప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ లో ఉండే ఈ గే పాత్రలు ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఈ మధ్యనే హీరో సుధీర్ బాబు హంట్ సినిమాలో గే పాత్రలో కనిపించాడు. అయితే ఈ పాత్ర అతనికి సెట్ అవ్వలేదు.. మరి శ్రీ విష్ణుకు ఏమైనా కలిసి వస్తుందేమో చూడాలి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్ట్
అవినీతి అక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తోన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని నియమించింది. ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలు కొత్త కమిటీ చూసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు సూచించింది. హెచ్‌సీఏలో ఎన్నికల ప్రతిష్టంభన తొలగించి.. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించడంపై ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ లావు నాగేశ్వరరావుకు హెచ్‌సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతల అప్పజెప్పాలని ప్రతివాదుల తరపు సీనియర్ న్యాయవాది దవే సుప్రీంకు పేర్కొన్నారు. దవే సూచనలను అంగీకరించిన సుప్రీంకోర్టు హెచ్‌సీఏ కమిటీ రద్దుకే మొగ్గుచూపింది. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావుకు అన్ని విధాలా సహకరించాలని హెచ్‌సీఏకు సుప్రీం ఆదేశించింది.