తెలంగాణలో రాజకీయ వేడి రోజురోజుకూ వేడెక్కుతోంది. పార్టీ నుంచి వ్యక్తిగతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
వైసీపీలో విషాదం.. క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ కన్నుమూత.. శివరాత్రి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది.. ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గత అర్ధరాత్రి కన్నుమూశారు.. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.. ఇక, 2009లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా…
కృష్ణాజలాల గురించి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయి. నీటి వినియోగానికి సంబంధించి వాస్తవంగా దక్కాల్సిన వాటా తమకు దక్కడం లేదని తెలంగాణ రాష్ట్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి సంబంధించి కృష్నా జలాల వాడకం పై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు పలు డిమాండ్లను ఉంచింది.
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భోళా శంకరుడిని దర్శనానికి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే భక్తులు పూజలు, అభిషేకాలు చేస్తూ శంభో శంకరా భోళ శంకరుడిని కీర్తిస్తూ శివుని కృపకు పాత్రులవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, కోటప్పకొండ, వేములవాడ, కాలేశ్వరం, కొమరవల్లి, ఐనవోలు, చెర్వుగట్టు సహా.. ఇతర శైవ ఆలయాలు భక్తుల రద్దీతో…
* నేడు మహాశివరాత్రి.. శివనామ స్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు, ఆలయాల వద్ద భక్తుల రద్దీ * నేడు గ్వాలియర్‌కు దక్షిణాఫ్రికా చీతాలు, ఇప్పటికే జొహన్నస్‌బర్గ్ నుంచి బయల్దేరిన చీతాలు.. నేడు భారీ హెలికాప్టర్లో శ్యోతిపూర్కు చీతాల తరలింపు * రెండో రోజు ఆస్ట్రేలియాతో భారత్ రెండో టెస్ట్.. ఢిల్లీ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం * మహిళల టీ20 వరల్డ్‌కప్: నేడు ఇంగ్లాండ్‌తో భారత్ ఢీ.. గెబెరా వేదికగా సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్..…
పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయం.. పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయం అని హెచ్చరించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించిన నాదెండ్ల మనోహార్.. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు.. రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి.. ఇప్పటికీ నష్టపరిహరం ఇవ్వలేదంటూ విమర్శించారు.. దీంతో, బాధితురాలు గంగమ్మకు…
తెలంగాణ సీఎం కేసీఆర్ 69 జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబరాలు నిర్వహిస్తుంది. కేసీఆర్ పెట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈనేపథ్యంలో.. సిద్దిపేట జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్ని కేక్ కట్ చేసిన శుభాకాంక్షలు తెలియజేశారు.
నేడే తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. రాష్ట్ర వ్యాప్తంగా సందడి టీఆర్ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇవాళ 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు…
Onion Farmers Tears: ఊహించని విధంగా ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. కొందరు ధర గిట్టుబాటు కావటం లేదని దేవరకద్ర మార్కె ట్లో విక్రయానికి తెచ్చిన ఉల్లిని, అదే వాహనంలో తిరిగి ఇంటికి తీసుకెళ్ళిన దుస్థితి. మార్కెట్లోకి వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఉల్లి ఒక్క సారిగా వచ్చిపడింది. 2 వేల వరకు ఉండే క్వింటాల్ ఉల్లి ధర ఒక్కసారిగా 600 నుంచి 1000 రూపాయలకు పడి పోయింది. మార్కెట్ కమిటి…
* నేటి నుంచి ఆస్ట్రేలియాతో భారత్ రెండో టెస్ట్.. ఢిల్లీ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ * తన కెరీర్లో ఇవాళ వందో టెస్ట్ ఆడనున్న చటేశ్వర పుజారా * నేడు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు * నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. ఇప్పటికే…