Cabinet Meeting: ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం, అధికారులు మేడారం రానున్నారు. వన దేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీ కానుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4:30 ని.లకు ముఖ్యమంత్రి, మంత్రులు మేడారం చేరుకోనున్నారు. 5 గంటలకు మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసి ఆచారసాంప్రదాయాల ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలుకుతారు. 5PM టూ 6:30PM వరకు హరిత హోటల్ ప్రాంగణంలో మంత్రివర్గం భేటీ కానుంది. మంత్రి వర్గ భేటీ అనంతరం హరిత హోటల్లో బస ముఖ్యమంత్రి, మంత్రులు బస చేస్తారు. ఇప్పటికే 300 మంది బస చేసేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం హరిత హోటల్లో 16 గదులు, టెంట్ సిటీలో మరో 40 తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. తాడ్వాయి హరిత హోటల్, రిసార్ట్స్, లక్నవరం, రామప్ప, ములుగు లోని వసతి గృహాలను అధికారులు ముందస్తుగా బుక్ చేశారు. సీఎం పర్యటనకు 1600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
READ MORE: DC vs RCB: త్రుటిలో స్మృతి మంధాన సెంచరీ మిస్.. వరుస విజయాలతో ఆర్సీబీ దూకుడు..!
సీఎం పర్యటన సందర్భంగా మేడారంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వరంగల్ నుంచి వచ్చే వారు ములుగు పస్రా నార్లాపూర్ మీదుగా మాత్రమే మేడారానికి రావాలని అధికారులు స్పష్టం చేశారు. తాడ్వాయి మీదుగా వాహనాలకు ఎంట్రీ లేదు. తిరుగుప్రయాణం బయ్యాక్కపేట భూపాలపల్లి పరకాల గుండెప్పాడ్ మీదుగా వరంగల్ వెళ్లాల్సి ఉంటుంది. సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ తెలిపారు. ఇదిలా ఉండగా.. వన దేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీకి కారణం ఏంటి? ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుంటారు? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
READ MORE: AR Rahman Controversy: ఆఫర్లకు మతానికి సంబంధం ఏంటి?.. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం!