తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ అసెంబ్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కంటి వెలుగు, సాగునీటిరంగ అద్భుత ప్రగతిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు అరవింద్ కేజ్రీవాల్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రెండు మంగళవారాల్లో 11 వేల మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు తెలిపారు.
ఏపీ రాజధాని అమరావతే.. సీఎం విశాఖకు పారిపోతున్నారు..! ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామని స్పష్టం చేశారు.. అయితే, విపక్షాలు మాత్రం.. అమరావతే రాజధాని అని చెబుతున్నాయి.. మరోసారి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన ఆయన.. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాం అని ప్రకటించారు.. అమరావతి రాజధాని అనే…
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈనెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరంగల్, నాందేడ్ నేషనల్ హైవే లపై రూ.18.61 కోట్ల వ్యయంతో పూలబాటలు పూర్తి చేసింది హెచ్ఎండిఏ. రూ.15.04 కోట్ల వ్యయంతో వరంగల్ హైవే (NH-163) వెంట 64 కిలోమీటర్లు, రూ.3.57 కోట్ల వ్యయంతో నాందేడ్ హైవే (NH-161) వెంట 33 కిలోమీటర్ల సెంట్రల్ మిడెన్ గ్రీనరీ, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు పూర్తి చేశారు.
రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్.. రైతులకు సాయం ప్రకటిస్తారా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు. రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీ పూర్ గ్రామాల్లో…
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై రాజకీయ దుమారం రేగుతుంది. అధికార, ప్రతిపక్ష మాటలు తూటాల్లా పేలుతున్నాయి. పేపర్ లీక్ విషయంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.