ఐ ఫోన్లు పడేయండి.. లేదంటే పిల్లలకు ఇవ్వండి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు ఐఫోన్లు వాడొద్దనే ఆదేశాలు అధికారులకు వెళ్లాయి. అధ్యక్ష భవనం క్రెమ్లిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అమెరికా తయారీ ఐఫోన్ కావడంతో పాశ్చాత్య దేశాలు నిఘా పెంచే అవకాశం ఉండటంతో క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తవి కొనొద్దని, ఉన్నవాటిని పక్కన పారేయాలని అధికారులను ఆదేశించారు. పని ముగిసిపోయింది, దాన్ని పడేయండి లేదా మీ పిల్లలకు ఇవ్వండి మార్చి చివరి నాటికే ప్రతీ ఒక్కరు ఈ పనిని పూర్తి చేయాలని రష్యా అధ్యక్షభవనం పాలనాధికారి సెర్గీ కియోంకో అక్కడి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఐ ఫోన్ స్థానంలో కొత్త ఓఎస్ ఉన్న ఫోన్లు అందించేందుకు రష్యా సిద్ధం అయింది. అయితే ఈ విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ధ్రువీకరించలేదు. కాగా, అధికార కార్యకలాపాలకు స్మార్ట్ ఫోన్లను వాడొద్దని నిర్ణయించారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్మార్ట్ ఫోన్లను వాడరని, వాటి వల్ల గోప్యంగా ఉండే సమాచారం బయటకు పొక్కే అవకాశం ఉందని, అత్యంత అరుదుగా పుతిన్ ఇంటర్నెట్ వాడుతారిన వెల్లడించారు.
ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల జాతకాలు భేష్
విశాఖ శ్రీ శారదాపీఠంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం గంటల పంచాంగాన్ని ఆవిష్కరించారు స్వరూపానందేంద్ర. కాల సర్ప దోషం కారణంగా మూడేళ్ళుగా దేశం ఇబ్బందులు పడిందన్నారు స్వరూపానందేంద్ర. ఈ ఏడాది చతుర్ గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. దీనివల్ల దేశానికి ఇబ్బందులు తప్పవు అన్నారు స్వరూపానందేంద్ర. ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటంతో కొంతవరకు ఇబ్బందులు తొలగుతాయి. ఉత్తరాదిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయన్నారు స్వరూపానందేంద్ర. దేశమంతటా వాహన ప్రమాదాలు అధికమవుతాయి. ఎండలు, వడదెబ్బలు ఎక్కువగా ఉంటాయన్నారు స్వరూపానందేంద్ర. జూలై నుండి సెప్టెంబరు వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతాయి. విదేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయన్నారు స్వరూపానందేంద్ర.ఇటు అరసవల్లి క్షేత్రంలో ఉగాది వేడుకలు , వేదపండితుల పంచాంగ శ్రవణం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠాకర్ ఉగాది పచ్చడి సేవించారు. సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ఆదిత్యుని మాడ్యువల్ ను ఆవిష్కరించారు కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి వసంత నవరాత్రోత్సవాలు.. పదిరోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు జరుగుతాయి. తొలిరోజు మల్లెపూలు,మరువంతో అమ్మవారికి పుష్పార్చన..పుష్పార్చనలో పాల్గొన్నారు ఆలయ వేద పండితులు,భక్తులు. అమ్మవారిని దర్శించుకున్నారు డిప్యూటీ సిఎం రాజన్న దొర, గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
బిల్కినో బానో పిటిషన్ పై విచారణకు సుప్రీం ఓకె
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు శిక్షను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు బిల్సిస్ బానో న్యాయవాది శోభా గుప్తా వెల్లడించారు. ఈ కేసులో కొత్త బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని శోభా గుప్తా తన వాదనల్ని వినిపించారు. బెంచ్ ఏర్పాటు చేస్తాం, ఈ సాయంత్ర దానిని పరిశీలిస్తామని సీజేఐ చెప్పారు. అంతకుముందు జనవరి 24న గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది, దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబంలోని ఏడుగురు హత్యకు గురయ్యారు. మే 13, 2022 నాటి ఉత్తర్వుల్లో అత్యున్నత న్యాయస్థానం 1992 జూలై 9 నాటి పాలసీ ప్రకారం ముందస్తు విడుదల కోసం దోషి చేసిన అభ్యర్థనను పరిగణించి, శిక్ష విధించిన తేదీకి వర్తించే గడువులోగా రెండు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
భట్టి విక్రమార్క యాత్రకు విరామం
కొమురం భీం జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర కు నేడు విరామం ఇచ్చారు. అయితే ఇవాళ ఉగాది పండుగ జరుపుకునేందుకు ఆయన పీపుల్స్ మార్చ్‌కు కాస్త విరామం ఇచ్చారు. పండుగను ఆదివాసీల మధ్య కుటుంబసభ్యులతో కలిసి జరుపుకోనున్నారు. ఝరి లో ఉన్న ఆలయాన్ని భట్టి విక్రమార్క వెళ్లి మొక్కుకున్నారు. ఈరోజు ఝరిలో పండుగ వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రజలందరికి శోభకృత్ నామ సంవత్సరంలో శుభాలు కాంక్షలు తెలిపారు. అందరూ ఆనందంగా ఉగాది పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. కాగా.. రేపు యధావిధిగానే భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. నిన్న ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర 6 వ రోజున చేరిన సందర్భంగా.. ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొననున్నారు. కొమురం భీం జిల్లా జామ్నే నుంచి కెరమెరి ఘాట్ రోడ్ మీదుగా కెరమెరి మండల కేంద్రము వరకు పీపుల్స్ మార్చ్ సాగింది. జామ్నే గ్రామం నుంచి 8 కిలోమీటర్ల తరువాత ఘాట్ రోడ్డు పక్కన లంచ్ బ్రేక్ కాగా.. కెరిమెరి లో రాత్రి కి కార్నర్ మీటింగ్ కెరిమెరి గ్రామంలోనే రాత్రికి బస చేశారు భట్టి. ఆరవ రోజు సుమారు 15 కిలోమీటర్ల మేర భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగింది. ఇవాల పండుగ రోజు కావడంతో యాత్రకు బ్రేక్ ఇచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన వర్షాలు.. మళ్ళీ 24, 25 తేదీల్లో కురిసే ఛాన్స్
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా వర్షాలు తగ్గాయి. 16 నుంచి వాతావరణంలో మార్పులు రావడం.. పగలు, రాత్రి అనక వర్షాలు, వడగండ్ల వానలు పడటంతో రెండు రాష్ట్రాల్లో వాతావరణ ఉక్కపోత నుండి కాస్త ఉపసమనం లభించింది. అయితే రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కాగా.. తెలంగాణలో మళ్లీ మార్చి 24, 25 తేదీల్లో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. కాగా.. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్ వరకు విస్తరించింది. దీని ప్రభావమే రాష్ట్రంలోని పలుచోట్ల అక్కడక్కడా ఓ మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. పగలు, రాత్రి ఉష్టోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కాగా.. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని చెప్పారు. అంతే కాకుండా.. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. చలి విషయంలో రాష్ట్రం మొత్తం సాధారణ ఉష్ణోగ్రతలే ఉండనున్నాయని తెలిపారు.
రాష్ట్రపతి నిలయం సందర్శించండి.. ప్రజలకు ద్రౌపది ముర్ము పిలుపు
హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఉగాది ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, హోం మంత్రి మహమూద్ ఆలీ పాల్గొన్నారు. రేపటి నుంచి రాష్ట్ర పతి నిలయం లోకి ప్రజలకు అనుమతించనున్నారు. వర్చువల్ గా ప్రారంభం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ సందర్భంగా రాష్ట్ర పతి ద్రౌపది ముర్మ మాట్లాడారు. కిందటి నెలలో హైదరాబాద్ లోని రాష్ట్ర పతి నిలయం లో బస చేసే అవకాశం దొరికింది.అసమయం లో అక్కడ వున్న ఫ్లోర అండ్ ఫో కోసం తెలుసుకొనే అవకాశం దొరికింది.వాటి అన్నిటిని ప్రజలు తెలుసుకోవాలని అనే ఆలోచన తో ప్రజలకు సందర్శనార్థం రాష్ట్ర పతి నిలయం ప్రారంభించడం జరిగింది..రాష్ట్ర పతి నిలయం చరిత్ర కి సంబందించిన పూర్తి విషయాలు నాలేడ్జ్ గ్యాలరీ లో లభిస్తాయి. రినోవెట్ చేసిన కిచన్ టన్నెల్ ను తెలంగాణ ట్రెడిషనల్ కళ తో నిర్మించాం.గతం లో వున్న రాష్ట్రపతుల చేతుల మీదగా వివిధ గార్డెన్స్ ప్రారంభించడం జరిగింది.ఇప్పుడు నా హయాంలో బుట్టర్ ఫ్లై., రాక్., నక్షత గార్డెన్స్ ., స్టెప్ వెల్స్., ప్రారంభించడం సంతోషంగా ఉంది..ప్రజలు అందరూ రాష్ట్రపతి నిలయం ని సందర్శించండి అని పిలుపునిచ్చారు. గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆరోగ్యంగా …సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. గతంలో కేవలం 15రోజులు మాత్రమే ప్రజలకు సందర్శనార్థం అనుమతించగా….ఇప్పుడు 11నెలల పాటు ప్రజలకు అనుమతించనున్న రాష్ట్ర పతి గారికి కృతజ్ఞతలు.కచ్చితంగా రాష్ట్రపతి నిలయం హైదరాబాదులోని ప్రత్యేకమైన టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ఒకటిగా నిలుస్తుంది.రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించేందుకు ప్రజలు ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు..ఆసక్తి ఉన్నవారు రాష్ట్రపతి నిలయంలో ఉన్న ఫ్లోరల్ కోసం అక్కడ ఉన్న స్కానర్లు స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. హైదరాబాదులోని టూరిస్ట్ అట్రాక్షన్స్ లో ప్రత్యేకమైనదిగా రాష్ట్రపతి నిలయం నిలుస్తుందన్నారు.
రోజుకు 15 నిమిషాలు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి
రోజులో మీరు ఒత్తిడికి గురవుతున్నారా.. మీకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తున్నాయా.. అయితే మీ ఫోన్ ను పక్కన పెట్టాల్సిందే.. ఈ విషయాన్ని స్వయంగా నిపుణులే చెబుతున్నారు. స్వాన్సీ విశ్వవిద్యాలయం నుంచి ఒక కొత్త అధ్యయనం ప్రకారం సోషల్ మీడియా వినియోగాన్ని రోజుకు కేవలం 15 నిమిషాలు తగ్గించడం వలన సాధారణ ఆరోగ్యం మరియు రోగనిరోధక పని తీరు మెరుగుపడటమే కాకుండా, నిరాశ మరియు ఒంటరితనం యొక్క లక్షణాలను కూడా మెరుగుపరుస్తుంది. మూడు నెలల పాటు, రీడ్, టెగాన్ ఫౌక్ప్ మరియు మరియం ఖేలా ప్రజలు తమ సోషల్ మీడియా వినియోగాన్ని రోజుకు 15 నిమిషాలు తగ్గించినప్పుడు శారీరక ఆరోగ్యం మరియు మానసిక పనితీరుపై ప్రభావాలను పరిశీలించారు. 50 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 20-25 సంవత్సరాల వయస్సు గలవారిని మూడు గ్రూపులుగా విభజించి వారి అలవాట్లలో ఏమి మార్పులు చేయకుండానే రోజుకు 15 నిమిషాలు ఫోన్ లో సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకునేలా చేశారు. అదే క్రమంలో సోషల్ మీడియాను ఎంతగా ఉపయోగిస్తున్నారు అనే దానిపై నివేదికలతో పాటు వారి ఆరోగ్యం మరియు మానసిక పనితీరు గురించి నెలవారీ ప్రశ్నావళికి కూడా సమాధానాలను సేకరించారు. రోజులో 15 నిమిషాల పాటు ఫోన్ కార్యకాలాపాలకు దూరంగా ఉన్నవారు, ఇతర ఫోన్లో రోజువారిగా సోషల్ మీడియాలో గడిపే సమూహాలతో పోలిస్తే సాధారణ ఆరోగ్యం, రోగనికరోధక పనితీరు, ఒంటరితనం మరియు నిరాశలో గణనీయమైన మెరుగుదల ఉన్నట్లు పరిశోధకులు కనుగోన్నారు.
కళ్యాణ్ రామ్ ‘డెవిల్’.. పక్కా పాన్ ఇండియా లెవల్
నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ బాక్సాఫీస్ వద్ద తన అభిమానులను నిరాశపరిచింది. సినిమాలో ఆయన ట్రిపుల్ రోల్ పోషించినా, కథలో ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీపై పూర్తి ఫోకస్ పెట్టారు కల్యాణ్ రామ్. ఈ క్రమంలోనే తాను నటిస్తున్న ‘డెవిల్’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 21వ చిత్రంగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ సెట్‌ను వేసిందట చిత్ర యూనిట్. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.3 కోట్ల మేర బడ్జెట్‌ను కేటాయించారని సమాచారం.