Ntv top-headlines-at-9AM
టీడీపీ వర్సెస్ వైసీపీ …నరసరావుపేటలో ఉద్రిక్తత
ఏపీలో రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న దాడులు, హత్యలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు టీడీపీ ఇన్చార్జ్ అరవింద్ బాబు. దీంతో అధికార పార్టీ నేతలు స్పందించారు. అధికార పార్టీ అండదండలతోనే దాడులు జరుగుతున్నాయని అరవింద్ బాబు ఆరోపించారు. ఈ ఆరోపణలపై కోటప్పకొండ వేదికగా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసురుకున్నారు టిడిపి, వైసిపి నాయకులు. ఈ నేపథ్యంలో నేడు కోటప్పకొండ వెళ్లేందుకు సిద్ధమయ్యారు టీడీపీ నేత అరవింద్ బాబు. కోటప్పకొండ వెళ్లేందుకు అనుమతులు లేవంటూ అరవింద్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. నరసరావుపేటకు ఎవరూ రావద్దని ఆదేశాలు జారీచేశారు. అయితే, టీడీపీ శ్రేణులు మాత్రం నరసరావుపేటకు వచ్చితీరతామంటున్నారు.
సీఎం జగన్ అంబరాన్నంటిన ఉగాది సంబరాలు
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ఇంట ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి.. ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి.. వేడుకల కోసం తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు.
మెస్సీపై పడ్డ అభిమానులు.. ఉక్కిరిబిక్కిరైన ఫుట్ బాల్ స్టార్
ఆర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఓకేసారి అభిమానులు మీద పడడంతో ఆయన కాస్త ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. అయితే ఆ తర్వాత బౌన్సర్స్ వారిని చెదరగొట్టడంతో మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం రాత్రి మెస్సీ భార్య, పిల్లలతో కలిసి అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లోని డాన్ జూలియా రెస్టారెంట్ కు వెళ్లాడు. తనకిష్టమైన ఫుడ్ ను తిని అక్కడి నుంచి బయలుదేరాలనుకున్నాడు. అయితే అప్పటికే మెస్సీ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు రెస్టారెంట్ బయట గూమిగూడారు. రెస్టారెంట్ నుంచి కారిడార్ లోకి వచ్చిన మెస్సీ వారికి అభివాదం చేశాడు. ఈలోగా బయటకు వచ్చిన మెస్సీని అభిమానులు ఒక్కసారిగా చుట్టముట్టారు. దీంతో ఉక్కిరిబిక్కిరికి గురైన మెస్సీ భయపడి రెస్టారెంట్ లోపలికి వచ్చేశాడు. ఆ తర్వాత లోకల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఇచ్చట అన్ని రకాల ఎగ్జామ్ పేపర్లు లభించును
ఎన్నాళ్ల నుంచో ఉద్యోగం కోసం కుటుంబాలను వదిలి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. లక్షలు లక్షలు ఖర్చుపెట్టి కోచింగులు తీసుకుంటే ఇలా ప్రభుత్వోద్యోగులు పేపర్లు లీక్ చేసి అక్రమాలకు పాల్పడడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆగ్రహావేశాలతో నిండి పోయి ఉన్నారు. దీంతో కొంత మంది ప్రత్యక్షంగా మరికొందరు పరోక్షంగా టీఎస్ పీఎస్సీ అసమర్థతను తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే టీఎస్ పీఎస్సీ ఆఫీసు ముందు ఇదో జీరాక్స్ సెంటర్, అన్ని రకాల ప్రశ్నాపత్రాలు దొరుకును అంటూ పోస్టర్లను అంటించారు.
డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ వెండితెర నటి
త్రిక్కకరలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని డ్రగ్స్ విక్రయిస్తున్న నటి పోలీసులకు చిక్కింది. కజకూట్టంకు చెందిన అంజు కృష్ణ అనే వ్యక్తి 56 గ్రాముల ఎండీఎంఏతో పట్టుబడ్డాడు. మహిళతో కలిసి నివసిస్తున్న కాసర్‌గోడ్‌కు చెందిన షమీర్ పోలీసులను చూసి పరారయ్యాడు. సిటీ పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో యోధవ్ స్క్వాడ్ సభ్యుల తనిఖీల్లో మహిళ పట్టుబడింది. ఈ బృందం సాధారణ తనిఖీ కోసం ఉనిచిర థోపిల్ జంక్షన్‌లోని భవనాన్ని సందర్శించింది. బిల్డింగ్‌లోని మూడో అంతస్తులో అరెస్టయిన అంజు, ఆమె స్నేహితుడు షమీర్ దంపతులు అనే నెపంతో జీవిస్తున్నారు. పోలీసులను చూడగానే షమీర్ పరిగెత్తుకుంటూ గోడ దూకి పరారయ్యాడు.
మార్కులు తక్కువస్తే పేరెంట్స్ తిడతారని భలే స్కెచ్ వేసింది.. కానీ సీన్ రివర్స్
పేపర్ కష్టంగా ఉండడంతో తల్లిదండ్రులు కోపగించుకుంటారేమోనన్న భయంతో బాలిక చేసిన పనితో తల్లిదండ్రులే కాకుండా పోలీసులు కూడా కంగుతిన్నారు. ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో 10వ తరగతి విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్లింది. స్కూల్ నుంచి వచ్చేసరికి ఆమె బట్టలు చిరిగిపోయాయి. ఆమెకు రక్తం కారుతోంది. దీంతో తల్లిదండ్రులు బాలికను కిడ్నాప్ చేసి వేధింపులకు గురిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో నిజాలు విని పోలీసులు కూడా షాకయ్యారు.బాలిక 10వ తరగతి పరీక్ష జరుగుతోంది. ఆ అమ్మాయికి మార్చి 15న సోషల్ స్టడీస్ పేపర్ వచ్చింది. కానీ ఈ పేపర్ అమ్మాయికి కష్టమైంది. పేపర్లో తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులకు కోపం వస్తుందని భయపడిన బాలిక.. తల్లిదండ్రుల అరుపులను తప్పించుకునేందుకు పథకం వేసింది. ఆమె తనకు తానే హాని చేసుకుంది. అప్పుడే కిడ్నాప్ డ్రామా సృష్టించింది. ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వస్తుండగా ఇద్దరు ముగ్గురు గుర్తు తెలియని అబ్బాయిలు అడ్డుకున్నారని తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఆమెను ఎక్కడికో తీసుకెళ్లారు. ఆమెను వేధించాడు.. శారీరకంగా దాడి చేశారని చెప్పింది. దీంతో ఆమెకు వైద్య పరీక్షలతో పాటు, ఆమెకు DCW సభ్యుడు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.
పండుగ పూట విషాదం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. వారే కారణమంటూ లేఖ
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలురా గ్రామంలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. రోజూలాగానే నీళ్లకోసం కుళాయి వద్దకు వెళ్లింది. అయితే మిగతావారు కూడా కుళాయి వద్దకు చేరుకుని నీళ్లు పడుతున్న సమయంలో ఒకనొకరు నేనంటే నేను ముందు అంటూ గొడవకు దిగారు. అయితే వైష్ణవితో శోభ అనే మహిళ గొడవకు దిగింది. అయితే ఆ చిన్న గొడవ చిలికి చిలికి గాలివానైంది. శోభతో పాటు సురేష్ అనే వ్యక్తి కూడా గొడవలకు దిగారు. దీంతో అందరిముందు తనతో వీరిద్దరూ గొడవ చేయడంతో.. ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో ఇంటర్ విద్యార్థి వైష్ణవి తీవ్ర మనస్తాపానికి గురైంది. శోభ, సురేష్ ఇద్దరు వైష్ణవిపై కేసు పెట్టడంతో ఇక పోలీస్టేషన్ కు వెళ్లాలా అని ప్రశ్నించుకుంది. తీవ్ర మనస్తాపానికి గురైంది. చివరకు పోలీసుల కేసు భయంతో ఆత్మహత్య చేసుకుందామని ఫిక్స్ అయ్యింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు శోభ, సురేష్ కారణం అంటూ సూసైడ్ నోట్ రాసింది. వైష్ణవి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.