తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ అసెంబ్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కంటి వెలుగు, సాగునీటిరంగ అద్భుత ప్రగతిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు అరవింద్ కేజ్రీవాల్.” ఐ క్యాంప్ సందర్శనకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే వెళ్ళాను. తెలంగాణలో 3 నుంచి 4 కోట్ల జనాభా ఉంది. అక్కడ ఉన్న ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలను చూసి నేర్చుకోవాలి. మేము ఢిల్లీలో, పంజాబ్ లో మాన్ సింగ్ అమలు చేస్తామని అక్కడే చెప్పాము. సాగునీటి రంగంలోనూ అద్భుతమైన పనులు జరుగుతున్నాయి. వాటిని పరిశీలించడానికి పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ సింగ్ మరోసారి ప్రత్యేకంగా తెలంగాణకు వెళ్లారు. వేరొకరి నుంచి ఎందుకు నేర్చుకోకూడదు. ఒకరి నుంచి ఇంకొకరు నేర్చుకునే ప్రభుత్వాల వేదిక మాత్రమే రాజకీయ అంశాలు కాదు” అని కేజ్రీవాల్ అన్నారు.
Also Read: Earthquake: ఢిల్లీలో మరోసారి భూకంపం.. 2.7 తీవ్రతతో స్వల్పంగా కంపించిన భూమి
తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్రాలు పరస్పరం నేర్చుకుని కలిసి అభివృద్ధి చెందాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మెరుగైన పాలన అందించాలంటే రాజకీయాలను పక్కన పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. కంటి వెలుగు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోని పేదలకు ఉపయోగపడుతుందని, అందుకే ఢిల్లీతో పాటు పంజాబ్‌లోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
Alsor Read: MLA Quota MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ.. ఏం జరుగుతుందో..?
కాగా, తాను ప్రతిపాదించిన ‘ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్స్ గ్రూప్'(G8)పై కేజ్రీవాల్ విలేకరులతో స్పందించారు. పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తూ లేఖలు పంపారు. ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాలను సందర్శించి ఒకరినొకరు నేర్చుకునేందుకు ఈ వేదిక ఉద్దేశించబడింది. ఇది పాలనా వేదిక, 2024 లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు కోసం కాదని కేజ్రీవాల్ తెలిపారు.