పరీక్ష ప్రారంభమైన ఏడునిముషాలకే పేపర్ లీక్
తెలుగు రాష్ట్రాల్లో లీకు వీరులు ఎక్కువైపోయారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతుండగా వికారాబాద్ లో తాజాగా 10వతరగతి ప్రశ్నాపత్నం లీకైందన్న వార్త కలకలం రేపింది. ఏపీలోని కడపలో కూడా ఇలాంటి లీక్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే తెలంగాణలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పేపర్ లీక్ అయింది. వికారాబాద్ జిల్లా తాండూర్‌లో తెలుగు పేపర్ లీక్ కలకలం సృష్టించింది. పేపర్ లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఉదయం 9.37 నిమిషాలకు పేపర్‌ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టినట్లు సమాచారం. సోమవారం ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా.. ఇంతలోనే పేపర్ లీక్ కావడంతో అందరూ అవాక్కయ్యారు. పరీక్షలకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రశ్నాపత్రం లీక్ వంటి ఘటనలు జరుగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా టెన్త్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. పేపర్ లీక్‌పై ఆరా తీస్తే ఓ ఉపాధ్యాయుడు దీనిని లీక్ చేసినట్లు తేల్చారు. వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు బంధ్యప్ప ఈ పేపర్ లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఆయనను తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించి పోలీసులు విచారించారు. ఎవరు దేని కోసం లీక్ చేశారనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. 9 గంటల 37 నిమిషాలకే ప్రశ్నాపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షమైంది.
గ్రాఫ్ పెంచుకోమనడంలో తప్పేం లేదు
ఏపీలో ఇవాళ జరిగిన వైసీపీ కీలక సమావేశంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం.. మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలో జరిగిన గడపగడపకు కార్యక్రమం సమీక్షలో కీలక వ్యాఖ్యాలు చేశారు ఆయన.. గృహ సారథులను, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను పూర్తి చేసుకోవాలి.. ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలి.. వాలంటీర్లను, గృహ సారథులను మమేకం చేయాలి.. వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికీ తీసుకెళ్లాలంటూ జగన్ ఉద్బోధ చేశారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్టీవీ తో మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. ఎమ్మెల్యేలు గ్రాఫ్ పెంచుకోకపోతే టికెట్ ఇవ్వననటంలో తప్పేం లేదు.మళ్ళీ ప్రభుత్వంలోకి రావటం కోసమే గ్రాఫ్ పెంచుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు నెలకు 25 రోజుల పాటు గడప గడప చేపట్టాలని చెప్పారు. 4 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచి చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడు. 175 స్థానాల్లో గెలుస్తాం అని చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబుకు 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే దుమ్ము ఉందా??గెలిచే దమ్ము లేకే దత్త పుత్రుడు, సీపీఐ, సీపీఎం అందరూ రావాలని పిలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం పార్టీతో ఉంటాడో అతనికే తెలియదని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఏ సంజాయిషీ ఇవ్వటానికి ఢిల్లీకి వెళ్ళాడు? పవన్ చంద్రబాబు పంచన ఉంటాడు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పోటీ చేయడు అన్నారు.
కడపలో టెంత్ ప్రశ్నాపత్రం లీక్
లీకు వీరులు ఎక్కువైపోయారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతుండగా వికారాబాద్ లో తాజాగా 10వతరగతి ప్రశ్నాపత్నం లీకైందన్న వార్త కలకలం రేపింది. ఏపీలోనూ ఇలాంటి లీకువీరుల కథ బయటకు వచ్చింది. అది కూడా సీఎం స్వంత జిల్లా కడపలో వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు మైక్రో జిరాక్స్ సమాధాన పత్రం ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తరవాత మాస్ కాపీయింగ్ కోసం సమాధానాలతో కూడిన మైక్రో జిరాక్స్ చేస్తుండగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఎక్కడో ఈ పశ్రపత్రం లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రశ్నపత్రంలోని నంబర్ల వారీగా సమాధానాలను ఒకే పేపర్ లో అమర్చిన ఈ జిరాక్స్ సమాధాన పత్రం ఎక్కడ నుంచి వచ్చిందీ అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఎవరు ఈ సమాధాన పత్రం తయారు చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది. అనేదానిపై విద్యాశాఖ అధికారులు కూడా విచారిస్తున్నారు. అయితే, జిల్లాలో ఎక్కడా ప్రశ్న పత్రం లీకేజీ కాలేదని, అన్ని విధాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు కడప డీఈవో రాఘవరెడ్డి చెబుతున్నారు. అయితే సీఎం సొంత జిల్లా బ్రహ్మంగారి మఠంలో మాస్ కాపీయింగ్‌కు సమాధాన పత్రం వెలుగుచూడటం ఆసక్తికరంగా మారింది. ఈ లీకు వీరులు ఎవరనేది విచారణలో బయటపడుతుందని అధికారులు అంటున్నారు. పదవతరగతి పరీక్షలు జరుగుతున్న వేళ ఈ పరిణామం అటు విద్యార్ధులు, ఇటు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
జైలు శిక్షపై సూరత్ కోర్టులో రాహుల్ పిటిషన్
పరువు నష్టం కేసులో తనకు విధించిన రెండేళ్ల శిక్షపై అప్పీల్ చేసేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు గుజరాత్ కోర్టుకు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని అవమానించేలా చేసిన వ్యాఖ్యకు పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తున్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులను రద్దు చేయాలని రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. నేరారోపణపై మధ్యంతర స్టే కోసం అభ్యర్థించారు. రాహుల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. పిటిషన్‌ను ఏప్రిల్ 13న విచారిస్తామని తెలిపింది. ఏప్రిల్ 13 వరకు బెయిల్‌ను పొడగించింది. అదే రోజు తదుపరి విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. రాహుల్ గాంధీ వెంట తన సోదరి ప్రియాంక గాంధీ సహా మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్(రాజస్థాన్), భూపేష్ బాఘేల్(ఛత్తీస్ గఢ్), సుఖ్విందర్ సింగ్ సుఖూ(హిమాచల్ ప్రదేశ్) కూడా సూరత్ కోర్టుకు వచ్చారు. కోర్టుకు హాజరు కావడానికి ముందు ఆయన నిన్న తన తల్లి సోనియా గాంధీని కలిశారు.
గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలీదు.. సుశాంత్
మాస్ మహరాజా రవితేజ తాజా చిత్రం ‘రావణాసుర’ ఈ నెల 7న జనం ముందుకు రాబోతోంది. ఇందులో ఐదు మంది కథానాయికలే కాదు… హీరో సుశాంత్ కూడా ఓ కీలక పాత్రను పోషించాడు. ‘రావణాసుర’ సినిమా గురించి సుశాంత్ మాట్లాడుతూ, “ఇందులో రాముడు ఎవరు రావణాసుడు ఎవరు అనేది ఇప్పుడు చెప్పడం సరి కాదు. బట్ ‘సుశాంత్ యాజ్ రామ్’ అనే పోస్టర్ ను రవితేజ మొదట్లో రిలీజ్ చేశారు. సో… ‘రావణాసుర’ టైటిల్ రోల్ రవితేజ గారిది. మీరు ట్రైలర్ చూస్తే గ్రే షేడ్స్ అందరికీ వున్నాయనేది అర్థం అవుతుంది. ‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్’ అనే ట్యాగ్ లైన్ కూడా వుంది. మరి ఇందులో రాముడు ఎవరో.. రావణాసురుడు ఎవరో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రావణాసుర చాలా ఎక్సయిటింగ్ థ్రిల్లర్. కొత్త ఎలిమెంట్స్ వున్నాయి. ట్రీట్ మెంట్ కొత్తగా వుంటుంది” అని చెప్పారు. తాను నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ మూవీ కూడా కొంత థ్రిల్లర్ జోనర్ కు చెందిందే అని అయితే, కంప్లీట్ థ్రిల్లర్ మూవీ మాత్రం ‘రావణాసుర’నే అని సుశాంత్ తెలిపారు. తన పాత్రకు సంబంధించిన చెప్పిన మార్పుల గురించి మాట్లాడుతూ, “అభిషేక్ గారు ఫోన్ చేసినపుడు, సోలో హీరోగా ఒక కథ రెడీ చేసి సినిమా చేయాలనే ఆలోచనలో వున్నాను. అభిషేక్ గారికి కూడా అదే చెప్పాను. కానీ ఈ కథ విన్నపుడు చాలా ఎక్సయిటింగా అనిపించింది. రవితేజ గారిని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఒక ప్రేక్షకుడిగా నాకు చాలా కొత్తగా అనిపించింది.
పద్మవిభూషణ్ బిరుదాంకితుల్ని వేధించడం దారుణం
ఏపీలో జగన్ పాలనపై మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కుంటుపడింది. రాచరిక, పాలెగాళ్ల పాలనను తలపించేలా ప్రభుత్వయంత్రాంగం పరిధి దాటి వ్యవహరిస్తోంది. ప్రతిపక్షాలతోపాటు, తెలుగు జాతి గర్వించేలా వివిధ రంగాల ప్రముఖుల్ని సైతం జగన్ ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు వర్ల రామయ్య. తెలుగుజాతి గొప్పగా చెప్పుకునే పద్మవిభూషణ్ బిరుదాంకితుల్ని సైతం కుసంస్కారంతో, దొంగ కేసులు, తప్పుడు కేసులతో వేధిస్తూ, ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారు.గత 9దశాబ్దాలుగా బ్రహ్మయ్య అండ్ కో సంస్థ ఏమచ్చ లేకుండా ఆడిట్ చేస్తుంటే, సంస్థకు చెందిన శ్రావణ్ ను కక్షతో తప్పుడు కేసులు బనాయిస్తారా..?అధికారంచేజారిపోతోందన్న దుగ్ధతో (ఫ్రస్టేషన్) జగన్ గంగవెర్రులెత్తి ప్రతిపక్షాలతో పాటు, సమాజంలోని ప్రముఖుల్ని కూడా దొంగకేసులతో అప్రదిష్ట పాలుచేస్తున్నాడు.ఈ ప్రభుత్వం కక్ష కార్పణ్యాలతో ‘ఫ్రొఫెషనల్స్’ పై కూడా దాడులుచేస్తూ, తప్పుడుకేసులు పెట్టడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు అన్నారు వర్ల రామయ్య.
మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగిచింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు సోమవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున సిసోడియా కస్టడీని పొడిగించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ కోరింది. రోస్ అవెన్యూ కోర్టులకు చెందిన సీబీఐ న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్..ఆప్ నేత సిసోడియాను ఏప్రిల్ 17న కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించారు.మార్చి 31న మాజీ ఉపముఖ్యమంత్రి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అతనికి బెయిల్‌ను తిరస్కరించిన సందర్భంగా న్యాయమూర్తి నాగ్‌పాల్, సిసోడియాను ప్రాథమికంగా నేరపూరిత కుట్రకు రూపకర్తగా పరిగణించవచ్చని అన్నారు. దాదాపు రూ. 90-100 కోట్ల అడ్వాన్స్ కిక్‌బ్యాక్‌ల చెల్లింపు తనకు, ఆప్ ప్రభుత్వంలోని తన ఇతర సహచరులకు మళ్లించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రెయిన్ బోకి ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదు.. ఎవరో తెలుసా?\
కన్నడ బ్యూటీ రష్మికా మందణ్ణను అదృష్టానికి మారుపేరుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ వెంటనే నేషనల్ క్రష్ అనే ట్యాగ్‌ని సొంతం చేసుకుంది. ఇక అప్పటినుంచి ఈ అమ్మడికి భాషా బేధాలు లేకుండా భారీ ఆఫర్లు ఒకదానికి తర్వాత మరొకటి వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు ఈ భామ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసే స్టేజ్‌కి చేరుకుంది. రెయిన్‌బో అనే టైటిల్ ఖరారు చేసిన ఈ సినిమాను ఈరోజే (03-04-23) హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. కొత్త దర్శకుడు శాంతారూబన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. మలయాళ నటుడు దేవ్ మోహన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.ఇకపోతే.. లేటెస్ట్‌గా ఈ రెయిన్‌బో సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రొమాంటిక్ ఫ్యాంటసీ డ్రామాకు రష్మికా మందణ్ణ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఆమె కంటే ముందు ఈ సినిమా కోసం స్టార్ హీరోయిన్ సమంతని సంప్రదించారు. ఆమెతో ఈ సినిమా చేయబోతున్నామని గతేడాది అక్టోబర్‌లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది కూడా!