తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల దళిత మేధావులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖదేవ్ థోరట్, ఇతర మేధావులు సందర్శించారు.
Also Read: Finland joins NATO: దేశ చరిత్రలో కొత్త శకం.. ఫిన్లాండ్ ప్రధాని సౌలి
భారత రాజ్యాంగ నిర్మాతకు ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి సముచిత నివాళులు అర్పించినందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును వారంతా ప్రశంసించారు. కొత్తగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు కూడా పెట్టారు. అంబేద్కర్‌కు సముచిత నివాళిగా సచివాలయానికి నామకరణం చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో పేరు తెచ్చుకున్నారని థోరట్ కొనియాడారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని పనిని సీఎం కేసీఆర్ చేశారని అన్నారు.
Also Read:Touching Vehicles: ఓ వ్యక్తిపై 5 ఏళ్ల పాటు వాహనాలను తాకకుండా నిషేధం.. ఎందుకో తెలుసా?
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఒకే భాష, ఒకే రాష్ట్రం బాబా సాహెబ్ అంబేద్కర్ కల అని, రాజ్యాంగంలో పేర్కొన్న ఆశయాలను అమలు చేసి కేసీఆర్ దీన్ని సాకారం చేశారన్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతోపాటు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, సమతా సైనిక్ దళ్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం నాయకులు తదితరులు పాల్గొన్నారు.