హైదరాబాద్ నగరంలోని చందానగర్ పీఎస్ పరిధిలో విషాదం నెలకొంది. చందానగర్ పీఎస్ పరిధిలోని తారానగర్లో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఇంట్లో ఆడుకుంటూ పొరపాటున మస్కిటో లిక్విడ్ తాగి ప్రాణాలు కోల్పోయాడు.
ప్రధాని మోడీ వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి వచ్చి.. తెలంగాణపై విషం చిమ్మారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణపై మోడీకి విద్వేషం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ప్రధాని మోదీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. రైతులపై విద్యుత్ భారం పెంచుతామంటే వ్యతిరేకించాం తప్ప, కేంద్రానికి అన్ని విషయాల్లో సహకరించామని ఆయన తెలిపారు.
SSC Papers: తెలంగాణలో ఎస్ఎస్సీ పరీక్షలు ఏప్రిల్ 11తో ముగియనున్నాయి. అనంతరం ఏప్రిల్ 13 నుంచి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ నగరానికి రానున్న నేపథ్యంలో వినూత్న రీతిలో స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు వెలిశాయి. ఇవాళ మధ్యాహ్నం ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నారు. దీంతో 'పరివార్ వెల్కమ్స్ యు మోడీ జీ’ అంటూ.. బీజేపీ నేతలు, వారి వారసుల ఫోటోలతో కూడిన పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు.