కాళేశ్వరం రిపోర్ట్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు... ఏం చేయబోతున్నారు ? సీఎస్ రామకృష్ణారావు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక హరీశ్‌రావుకు ఇస్తారా? అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంటే... అంతకు ముందే కమిషన్ నివేదికపై మాజీ మంత్రి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా ? కాళేశ్వరంపై తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది ?
రాఖీ పండుగ....గులాబీ పార్టీ ఇంటి గుట్టును బజారున పడేలా చేసిందా ? ఈ పండుగకైనా ఇంటి మనుషులు కలుస్తారేమో అనుకున్న క్యాడర్‌కి...నిరాశే మిగిలిందా ? ఎన్టీవీ వేదికగా రాఖీ కట్టడానికి సిద్ధమని చెల్లెలు చెప్పినా...అన్నయ్య మాత్రం అందుకు ససేమిరా అన్నారా ? అన్నాచెల్లెళ్ల వ్యవహారశైలి...తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఇద్దరి మధ్య వార్ పీక్ స్టేజ్‌కి చేరుకుందా ?
సామాజిక న్యాయం కోసం సాయుధ పోరాటాన్ని నమ్మి అడవిలో పోరుబాట పట్టిన ఆ చెల్లి.. 40 ఏళ్లుగా ప్రతి ఏటా రాఖీ పండుగ రోజున తోడబుట్టిన అన్నను తలుచుకొని రాఖీ కట్టలేక పోతున్నాను అనే బాధను పంటి కింద దిగబట్టుకుని నాలుగు దశాబ్దాల అనంతరం ఈ రోజు తోడబుట్టిన అన్నకు రాఖీ కట్టింది..
NTPC : తెలంగాణకు ఇది ఒక శుభసంకేతంగా చెప్పుకోవాలి. పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా నిలిచిన జాతీయ సంస్థ ఎన్టీపీసీ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందం జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమై తమ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఎన్టీపీసీ ప్రతినిధులు రాష్ట్రంలో సౌర, గాలి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులపై సుమారు రూ. 80,000 కోట్ల పెట్టుబడులు…
శ్రీశైలం డ్యామ్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి.. అయితే, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. శ్రీశైలాం జలాశయం వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై సున్నిపెంట పోలీసులు చర్యలు చేపట్టారు..