కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మంచిర్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. బండి సంజయ్ తోపాటు జెండా ఊపిన రాష్ట్ర మంత్రి జి.వివేక్, ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి. వందేభారత్ రైలు ప్రారంభం సందర్భంగా కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. మంచిర్యాలలో నేటి నుండి ‘‘వందే భారత్’’ హాల్టింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. జై బీజేపీ, జై బండి సంజయ్ నినాదాలతో మారుమోగిన మంచిర్యాల రైల్వే స్టేషన్.. కార్యకర్తల నినాదాలతో గందరగోళం ఏర్పడింది.
దీంతో ఇట్లా నినాదాలు, గొడవలు చేసి డిస్ట్రబ్ చేస్తే ఒక్క అభివృద్ధి పని కూడా రాదనే సంగతి గుర్తుంచుకోవాలంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. నినాదాలు చేస్తుంటే వారించారు. కొట్లాటలు కావాలా..అభివృద్ధి కావాలా.. కాంగ్రెస్, బిజెపి ఏ పార్టీ వాళ్లు అయినా నినాదాలు చేయవద్దు.. నినాదాలు చేస్తే కార్యక్రమం నుంచి వెళ్ళిపోతానని కార్యకర్తలతో బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో సద్దుమణిగిన నినాదాలు..
Also Read:Tragedy: గుండ్ల పోచంపల్లిలో విషాదం.. ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు..
బండి సంజయ్ సహకారంతోనే మంచిర్యాలలో వందే భారత్ రైలు హాల్టింగ్ వచ్చిందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రజలు అల్లాడుతున్నారని అంజిరెడ్డి తెలిపారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులను కోరారు. కేరళ ఎక్స్‌ప్రెస్ మంచిర్యాల లో స్టాప్ ఉండాలని బండి సంజయ్ ని మంత్రి వివేక్ కోరారు. శబరిమలకు వెళ్ళే భక్తుల ఇబ్బందులు తొలగించాలని కోరారు.