పెద్ద అంబర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా కారు అదుపుతప్పి పల్టీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి సౌమ్యా రెడ్డి మృతి చెందారు.. మరో ఏడుగురు ఇన్ఫోసిస్ ఉద్యోగులకు తీవ్ర గాయాలు అయ్యాయి.. ఇన్ఫోసిస్ ఉద్యోగం చేస్తున్న అందరు సరళమైసమ్మ టెంపుల్ వెళ్ళి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. బొంగుళూరు గేట్ నుండి పోచారం వైపు వెళుతుండగా ఇన్నోవా పల్టీ కొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Also Read:Pawan Kalyan : OG.. ఉస్తాద్ ఫినిష్.. నెక్ట్స్ ఏంటి పవన్ ?
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. మితిమీరిన వేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం కావొద్దని.. ప్రాణాలను రిస్కులో పెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. సౌమ్య రెడ్డి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధితులంతా ఇన్ఫోసిస్ ఉద్యోగులే కావడంతో తోటి ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.