తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారికి సన్మాన కార్యక్రమాలు ఉంటాయని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. 3, 4, 5 తేదీల కార్యక్రమాలు త్వరలో చెబుతామన్నారు. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి మొదట నివాళులు అర్పించిన తర్వాత.. బాబూ జగజ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పిస్తాం.. హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చిన్నారెడ్డి చెప్పుకొచ్చారు.
జూన్ ఒకటి నుంచి జూన్ 7 వరకు పార్లమెంట్ వారిగా మీడియా సమావేశాలు, సోషల్ మీడియా influencer లతో సమావేశం.. వికాస్ తీర్థ పేరుతో కేంద్ర అభివృద్ది సంక్షేమ పథకం విజిట్.. దీనికి కేంద్ర మంత్రి, జాతీయ నేతలు హాజరు అవుతారు అని బండి సంజయ్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక విభాగాలు డ్రగ్స్ నార్కోటిక్స్ వింగ్ & తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్స్ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వింగ్స్ ను రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత అటువైపు అడుగులు వేయకుండా జాగ్రత్తలను తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త వింగ్ లను రాష్ట్ర హోం శాఖ స్టార్ట్ చేసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. ఉదయం నుంచి ఆర్టీఏ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. రవాణా శాఖ సర్వర్ డౌన్ కావడం వల్ల కార్యకలాపాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
Puvvada Ajay Kumar: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు 10 బీఆర్స్సే గెలుస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు చేయకుండా కలిసి పనిచేసి జిల్లాలో బీఆర్ఎస్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బుధవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.