వన్య ప్రాణులను తీసుకొచ్చి ప్రదర్శన ఏర్పాటు చేసిన జోరా పబ్ ఓనర్ వినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మేనేజర్ వరహాల నాయుడు, పబ్‌కి వన్యప్రాణులను సరఫరా చేసిన హైదరాబాద్ పెట్స్ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 84శాతం మంది అభ్యర్థులు పాస్ అయినట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్ చేయాలని నిర్ణయం తీసుకుంది. సిట్ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా ఎంత అవగాహన కార్యక్రమాలు చేపట్టిన వాహనదారులు మాత్రం రోడ్డు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
MP Seats: జనాభా ప్రాతిపదికన 2026 తర్వాత జరిగే లోక్‌సభ స్థానాల (లోక్‌సభ స్థానాలు) డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు (దక్షిణ భారతానికి) తీవ్ర అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..! ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు కలిగినవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. వచ్చే నెల నుంచి రాగులను పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.. రాయలసీమలోని కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో రేషన్‌కార్డులపై ఉచిత బియ్యం, సబ్సిడీ కందిపప్పు, చక్కరతో పాటు వచ్చే నెల నుంచి రాగులను కూడా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. ఉచిత బియ్యానికి బదులు ఒక్కొక్క కార్డుపై గరిష్ఠంగా 3 కేజీల…
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని విజయాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ మరో ముందడుగు వేసింది. ప్రధాని ప్రజలకు చేసిన సేవలను వివరించి మరోసారి దీవించాలని, ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ పేరిట దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
Rudra Karan Partaap : కొద్దిరోజుల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అటువైపు కాంగ్రెస్ , బీజేపీ ఎలాగైనా కేసీఆర్ ను గద్దెదించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.