తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత అటువైపు అడుగులు వేయకుండా జాగ్రత్తలను తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త వింగ్ లను రాష్ట్ర హోం శాఖ స్టార్ట్ చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల మందితో నార్కోటిక్స్, సైబర్ బ్యూరోలను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ నివారణకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను నెలకొల్పనున్నారు. ఈ రెండు విభాగాలను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెండు విభాగాలు ఏర్పాటు చేశారు.
Read Also: Naresh: పవిత్ర అంటే ఎందుకంత పిచ్చి నరేషా..
టవర్-బి లోని 13వ అంతస్తులో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను.. టవర్-బిలోని 2,3 అంతస్తుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశారు. నార్కోటిక్ బ్యూరో అదనపు డీజీగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు అదనపు బాధ్యతలను అప్పగించగా.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాన్ని యువతకు అందించేందుకు ఈ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా అవగాహన కల్పిస్తారు. యువతకే కాదు డ్రగ్స్ యూజ్ చేస్తున్నా.. అందరికీ ఈ బ్యూరోలో కౌన్సిలింగ్ ఇస్తారు. తద్వారా వారిలో సత్ఫవర్తనను రాబట్టే విధంగా చేస్తారు. విదేశాల నుంచి వచ్చే మాదక ద్రవ్యాలను పట్టుకోవడంతో పాటు.. ఆ దేశాల అధికారులతో సమాచారాన్ని షేర్ చేసుకుంటారు. అంతే కాకుండా రాష్ట్రాల్లోనూ ఈ సమాచారాన్ని మార్పిడి చేసుకుంటారు.
Read Also: Vizag Supari Gang: విశాఖలో సుపారీ గ్యాంగ్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్
సైబర్ సెక్యూరిటీ బ్యూరో వల్ల ఆన్లైన్ మోసాలు అనేవి ఎక్కువగా జరగకుండా చూసుకుంటూ.. ఒకవేళ మోసాలు జరిగిన కేసును త్వరితగతిన ఛేదించడానికి ఉపయోగపడతాయి. దేశాన్ని కుదిపోసిన 67 కోట్ల మంది డేటా చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అంతేకాదు ఆ సమాచారాన్ని చోరీ చేసిన సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ఎంతో శ్రమించారు. అదే కాకుండా ఇంకా సైబర్ నేరాలు ఎన్ని ఉన్నాయో వాటి అన్నింటికి ఈ బ్యూరో ఎంతో ఉపయోగపడుతోంది.