తెలంగాణ రాష్ట్రంలో రెండు కీలక విభాగాలు డ్రగ్స్ నార్కోటిక్స్ వింగ్ & తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్స్ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో వింగ్స్ ను రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో వింగ్ కు ఛీఫ్ గా సీవీ ఆనంద్, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్ కు ఛీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకం అయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
Read Also: Gunturu Kaaram: టైటిల్ అనౌన్స్మెంట్… బీడీ 3Dలో కనపడతాంది
క్రీడా శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర సంవత్సరాల్లో హైదరాబాద్ లో ఎలాంటి అలజడి లేదు అని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతలు కాపాడంలో పోలీసుల కృషి అమోఘం అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల సైబర్ నేరాలు పెరుగుతున్నాయి.. దేశంలో ఎక్కడ ఏది జరిగిన తెలంగాణ పోలీస్ ల సలహా తీసుకుంటున్నారు.. వ్యవస్థలో పోలీసుల పనితీరు వల్లే అభివృద్ది సాధ్యం అవుతుంది అని ఆయన తెలిపారు.
Read Also: Human Trafficking: 59 మంది పిల్లల అక్రమ రవాణా.. రక్షించిన పోలీసులు
ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరిగింది అని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాదక ద్రవ్యాలు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి రవాణా అవుతూన్నాయి.. భారత దేశ చట్టాల్లో మార్పు రావాలి.. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ దయనీయంగా ఉండేది.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ మోడల్ పోలీసింగ్ దేశానికి ఆదర్శంగా నిలిచింది అని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.