జూన్ 2 న రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉదయం 9 గంటలకు జాతీయ జండాను గవర్నర్ తమిళిసై ఎగురవేయనున్నారు అని తెలిపారు. 10 నుంచి 11 గంటల వరకు ప్రజల్ని గవర్నర్ కలవనున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మోడీ 9 ఏళ్ల పాలన పై జన సంపర్క్ అభియాన్ ను ప్రారంభించారు. మోడీ పాలనకు మద్దతుగా మిస్డ్ కాల్ ( 9090902024 ) ఇవ్వాలని తెలిపారు.
Read Also: Minister Srinivas Goud: తొమ్మిదిన్నర సంవత్సరాల్లో హైదరాబాద్ లో ఎలాంటి అలజడి లేదు
జూన్ ఒకటి నుంచి జూన్ 7 వరకు పార్లమెంట్ వారిగా మీడియా సమావేశాలు, సోషల్ మీడియా influencer లతో సమావేశం.. వికాస్ తీర్థ పేరుతో కేంద్ర అభివృద్ది సంక్షేమ పథకం విజిట్.. దీనికి కేంద్ర మంత్రి, జాతీయ నేతలు హాజరు అవుతారు అని బండి సంజయ్ పేర్కొన్నారు. జూన్ 8 నుంచి 14 వరకు బీజేపీ సీనియర్ కార్యకర్తల సమావేశం.. జన్ సంఘ్ నుంచి ఇప్పటి వరకు పని చేస్తున్నా.. చేసిన వారితో సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ వారిగా బీజేపీ అనుబంధ మోర్చాలతో ఉమ్మడి సమ్మేళనం జరుగనున్నట్లు బండి సంజయ్ తెలిపాడు.
Read Also: China Drilling: భూగర్భంలోకి 10000 మీటర్ల లోతైన రంధ్రాన్ని తవ్వుతున్న చైనా.. ఏం చేయబోతున్నారు?
అసెంబ్లీ వారీగా మేధావులతో ఆత్మీయ సమ్మేళనం కొనసాగనుందని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. జూన్ 15 నుంచి జూన్ 22 వరకు అన్ని అసెంబ్లీలలో బహిరంగ సభలు.. జూన్ 21 న ప్రతి మండలం పది చోట్ల నిర్వహణ.. జూన్ 22 నుంచి 28 వరకు కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులతో సమావేశం.. గడప గడపకు బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. జూన్ 23 న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్.. జూన్ 25న ప్రతి పోలింగ్ బూత్ లో మన్ కి బాత్ కార్యక్రమం.. జన సంపర్క్ అభియాన్ లో కేవలం మోడీ చేసిన కార్యక్రమాల పైనే ప్రచారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం లేదా పార్టీలను విమర్షించడం కోసం ఈ కార్యక్రమాలు చేయడం లేదని బండి సంజయ్ వెల్లడించారు. మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాల బహిరంగ సభలు తెలంగాణలో నిర్వహిస్తామని బండి సంజయ్ అన్నారు.