Telangana: జగిత్యాలలో దారుణం..అన్నను రోకలిబండతో కొట్టి చంపిన తమ్ముడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో మనుషుల మధ్య మానవత్వం లేదు.. సంబంధ బాంధవ్యాలు కూడా సరిగ్గా ఉండటం లేదు.. డబ్బులు సంపాదించాలనే కోరిక తప్ప బంధం, బంధుత్వం అనేది లేకుండా పోయింది.. డబ్బుల కోసం సొంతవాళ్ళను సైతం పొట్టన పెట్టుకుంటున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. తాజాగా తెలంగాణాలో మరో దారుణం జరిగింది.. ఆస్తి కోసం సొంత అన్ననే అతి కిరాతకంగా చంపాడు ఓ తమ్ముడు ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కి పడింది..
వివరాల్లోకి వెళితే.. తెలంగాణ జగిత్యాల జిల్లాలోని బుగ్గారం మండలం చిన్నాపూర్‌లో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఇడగొట్టు తిరుపతి ని పాత కక్షల నేపథ్యంలో తమ్ముడు శ్రీనివాస్ అతి దారుణంగా రోకలితో కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది..
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ఆదివారం అర్ధరాత్రి ఇంటి బయట ఒంటరిగా నిద్రిస్తున్న తిరుపతిపై తమ్ముడు శ్రీనివాస్ రోకలిబండ తో దాడి చేసినట్లు తెలుస్తుంది. తలకు బలమైన గాయం కావడంతో తిరుపతి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై బుగ్గారం పోలీసులు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. రక్తం పంచుకున్న అన్నదమ్ములు ఇలా ఆస్తి కోసం ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం.. అందరిని కలచివేస్తుంది.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలే హత్యకు కారణం అయి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!