Telangana: దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రభుత్వం నేడు విద్యా దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీతో పాటు పాఠశాలలను ప్రారంభించి పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.
తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని.. అందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావును అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణకు చల్లటి కబురు అందింది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
Black Magic: చేతబడి చేస్తున్నారనే అనుమానంతో దంపతులను చెట్టుకు ప్రమాదకర రీతిలో వేలాడదీశారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.