Vande Bharat Train: తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ట్రైన్ రాబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ నడుస్తోంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది భారత రైల్వే. సికింద్రాబాద్-నాగ్ పూర్ మధ్య వందేభారత్ రైలు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే ఈ రూట్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి. సాధారణ కార్యకలాపాలకు అనువుగా ఉందని రైల్వే శాఖ నిర్థారణకు వచ్చింది.
KTR-Harish Rao: నేడు సిద్దిపేట పట్టణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పర్యటించనున్నారు. ముందుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు కొద్దిసేపు విశ్రాంతి అనంతరం 10.30 గంటలకు పట్టణ శివారులోని ఇర్కోడు గ్రామంలో ఆధునిక కబేళాను ప్రారంభిస్తారు.
తెలంగాణలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇప్పుడు మరో ఘోర ప్రమాదం జరిగింది..బిడ్జి పై నుంచి ఆటో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.. బూర్గంపాడు శివారులోని ఆంధ్ర సరిహద్దు కిన్నెరసాని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి మహీంద్రా ట్రాలీ బోల్తా పడింది.. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన నరసింహారావు, దుర్గారావు, పచ్చి…
Heat Wave: అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాన్ ‘బిపార్జాయ్’ గుజరాత్ తీరంపై విరుచుకుపడేందుకు చూస్తోంది. రేపు గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. గుజరాత్ తో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ గోవాల రాష్ట్రాలతో పాటు డామన్ డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హావేలీ కేంద్ర పాలిత ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించింది భారతవాతావరణ శాఖ(ఐఎండీ).
హస్తం పార్టీలో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పునర్ వ్యవస్థీకరణపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నజర్ పెట్టారు.