కసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్యుతాపురం వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్... ఏపీలో భూముల విలువలు తగ్గాయని చంద్రబాబు, కేసీఆర్‌కు చెప్పరంటా అని ఎద్దేవా చేసిన ఆయన.. ఒకసారి అచ్యుతాపురం కేసీఆర్ వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందని సూచించారు
తెలంగాణ రాష్ట్రం అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు దశ కు చేరుకున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కు మరియు పింఛనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్‌ను పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులను కూడా జారీ చేసింది.జీవోలో ఈ విధంగా పేర్కొన్నది.ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ దాదాపు 30శాతం పెంచింది. బదిలీ పై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ను 30శాతం పెంచింది. సెలవు రోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు అలాగే…
Rahul Gandhi: పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో జరుగుతున్న విపక్షాల సమావేశానికి కాంగ్రెస్ తరుపున రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. పాట్నా చేరుకున్న వీరిద్దరు అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధిస్తామని.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ కనిపించకుండా చేస్తామని రాహుల్ గాంధీ అన్నారు. పేదల పక్షాన కాంగ్రెస్ నిలబడుతోందని.. ఇద్దరుముగ్గురు కోసమే బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు.
Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచుతూ ముందుకు సాగుతున్నారు భట్టి విక్రమార్క పాదయాత్ర నేటితో సెంచరీ చేసింది. నేడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది.
మా విశాఖలో కూడా ఎకరం అమ్మితే.. తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు అని చెప్పుకొచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్... తెలంగాణలో హైదరాబాద్ కాకుండా బయటకు వెళ్తే భూములకు ధర ఎక్కడుంది? అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన మాటలు మాట్లాడితే కేసీఆర్ మాటలని కూడా ప్రజలు నమ్మరని సూచించారు .
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వందో రోజుకు చేరువైంది.. విక్రమార్క పాదయాత్ర 100వ రోజు శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి నుంచి ఉదయం 7:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుండగా.. కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది.