ప్రముఖ గాయకుడు సాయి చంద్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందిస్తున్నారు. సాయి చంద్ మరణవార్త విన్న మంత్రి హరీష్ రావు, బాల్కా సుమన్ కేర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
BRS: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని మహారాష్ట్రలో కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇటీవల మహారాష్ట్ర రాజకీయాలపై ఫుల్ ఫోకస్ చేశారు. ఇటీవల నాగ్ పూర్ లో పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్ ఇతర తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ సమావేశాలకు, సభలకు ఎక్కువ మంది తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో…
కోడిగుడ్డు మీద ఈకలు పీకే విదంగా.. బురద జల్లే ప్రయత్నం గవర్నర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు కానీ.. ఆరోపణలు చేయడం మంచిది కాదు అని ఆయన అన్నారు. వైద్య సిబ్బంది చాలా కష్టపడుతున్నారు.. కంటి వెలుగు మీద ఒక్క సారి కూడా మెచ్చుకోలేదు అని గవర్నర్ పై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేడు పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా పీవీ ఘాట్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. పీవీ నర్సింహారావుకు ఘనమైన నివాళులు ఆర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పీవీ చరిత్ర ఘనమైనది.. దక్షిణ భారతం నుంచి ప్రధాన మంత్రి అయిన ఏకైక వ్యక్తి పీవీనే అని ఆయన పేర్కొన్నారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ మన పీవీ నర్సింహారావు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. నాడు ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని సీఎం కేసీఆర్ తెలిపారు. మాజీ భారత ప్రధాని పీవీ నరసింహరావు 102 వ జయంతి సందర్భంగా సీఎం కేసిఆర్ వారి సేవలను స్మరించుకున్నారు.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై పరోక్షంగా విమర్శించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అధికారం మదంతో కొంత ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.. కబ్జాలు దౌర్జన్యాలు పెరిగిపోయాయి.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. 105వ రోజు సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మోతే నుంచి ప్రారంభమైంది. హుసేనాబాద్, మామిళ్ళగూడెం వరకు ఇవాళ పాదయాత్ర కొనసాగనుంది. మామిళ్ళగూడెం వద్ద భట్టి విక్రమార్క లంచ్ బ్రేక్ తీసుకోనున్నాడు. సాయంత్రానికి ఖమ్మం జిల్లాలోకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రవేశించనుంది.