తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో మార్పులు చోటుచేసుకుంటాయా? ఇదే ఇప్పుడు కమలనాథుల్లో హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం కేంద్ర మంత్రిమండలి సమావేశం ఉన్నందున టీబీజేపీలో ఎలాంటి మార్పులు జరుగుతాయనే చర్చ మరింత హీటెక్కిపోతోంది
మహబూబాబాద్ జిల్లాలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మోడీ వరంగల్ ప్రజలకు క్షమాపన చెప్పిన తరువాతే ఈ జిల్లాకు రావాలి అని అన్నారు. మరో పదిరోజుల్లో నరేంద్ర మోడీ వరంగల్ కు వస్తున్నారు.. నరేంద్ర మోడీని మా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల తరుపున అడుగుతున్నాను అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో కోవర్టులు ఉన్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. ఈటల రాజేందర్ అనేటోడు పార్టీ మారడు.. అంగీ మార్చుకున్నంత ఈజీ కాదు పార్టీ మారడం అంటే అంటూ కామెంట్స్ చేశారు.
మహిళా అభ్యర్థులు పరీక్ష రాయాలంటే తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంపై మహిళా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల పేరుతో సంప్రదాయాలను కించపరుస్తున్నారని ఫైర్ అవుతున్నారు. దీనిపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు. పరీక్షకు హాజరయ్యే మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని రూల్స్ లేదని ఆయన చెప్పారు.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న హైదరాబాద్ లో ఒకే రోజు 5 హత్యలు చోటు చేసుకున్నాయని.. నిన్న సూర్యాపేటలో పట్టపగలే దారుణ హత్య జరిగిందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలుగులో తొలి తీర్పు వెలువరించడం ద్వారా చరిత్ర సృష్టించింది. సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు తొలిసారిగా తెలుగులో తీర్పు వెల్లడించింది.
జులై మొదటి వారంలో కేంద్రమంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జూలై 17 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కేంద్రమంత్రివర్గంలో మార్పులు జరుగనున్నాయి. అయితే ఈసారి జరిగే మంత్రివర్గ కూర్పులో తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం ఉంది..!.