Delhi: ఇది మామూలు ట్విస్ట్ కాదు.. ఏకంగా పెళ్లి జరిగిన తర్వాతి రోజు నవవధువు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసి షాక్ తినడం వరుడి వంతైంది. పెళ్లి కూతురు బంధువులు అంతా కలిసి పెళ్లి కొడుకును మోసం చేశారు. తమ కుమార్తె గర్భవతి అనే విషయాన్ని దాచి పెట్టి వివాహం జరిపించారు. తీరా తెల్లారేసరికి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన న్యూఢిల్లీ గ్రేటర్ నోయిడా ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనకు మన సికింద్రాబాద్…
టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కేయూ, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున TS ICET 2023 ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య టి.రమేశ్ వరంగల్లో విడుదల చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో తెలంగాణలో పర్యటించనున్నారు. వచ్చే నెల 8న ప్రధాని వరంగల్ కు రానున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ ఓరలింగ్ సెంటర్ కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్కు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. వరంగల్ టూర్ లో భాగంగా.. అధికార కార్యక్రమాలతో పాటు బహిరంగ సభ ఉండబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాసేపట్లో గుర్రంగూడ నుంచి సాయిచంద్ అంతిమయాత్ర స్టార్ట్ కానుంది. కాగా ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ గుర్రంగూడలోని సాయింద్ నివాసానికి కాసేపట్లో వెళ్లనున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు.
గేదెను ట్రాలీ ఎక్కిస్తున్న ఓ వీడియోను షేర్ చేశారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. గేదెను ట్రాలీకి కట్టి.. దానిని వెనకనుంచి తన్నగానే వెంటనీ ట్రాలీలోకి ఎక్కేసింది.. ఇక, ఇలాంటి ట్రీట్మెంట్ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అవసరం అంటూ ఆయన కామెంట్ రాసుకొచ్చారు.. అంతేకాదు.. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్, తెలంగాణ బీజేపీని ట్యాగ్ చేసి ఆ ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. తొలి ఏకాదశి, బక్రీద్ పండగలు ఒకే రోజు కావడంతో ప్రార్థనలు, పూజలతో భక్తులు నిమగ్నమైపోయారు. ఆలయాల వద్ద భక్తులు.. మసీదుల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
రేపు కొమురం భీం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు పలు అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రారంభించనున్నారు.
తెలంగాణ ఉద్యమ గాయకుడు,ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సీఎం సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.