తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకం ద్వారా దళితులకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తొలి విడత దళితబంధు విజయవంతం కావడంతో తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండో విడత లబ్ధిదారుల ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
స్కూలు పిల్లల పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు తెలంగాణలో ‘నో బ్యాగ్ డే’ అనే కొత్త కార్యక్రమం ప్రవేశపెట్టబడింది. పాఠశాలలను విద్యార్థులకు మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ప్రతినెలా నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు #PeopelsMarch100Days అనే హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.. మరోవైపు.. #PeoplesLeaderBhatti అనే హాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది..
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.