ప్రముఖ గాయకుడు సాయి చంద్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పందిస్తున్నారు. సాయి చంద్ మరణవార్త విన్న మంత్రి హరీష్ రావు, బాల్కా సుమన్ కేర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే, సాయి చంద్ మృతదేహాన్ని గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి నుంచి బిఎన్ రెడ్డి నగర్ లోని ఆయన నివాసానికి తరలించారు.
Read Also: Sarvajit Laxman Century: హైదరాబాద్ నుంచి.. మరో క్రికెటర్ తనయుడు వచ్చేస్తున్నాడు!
సాయిచంద్ మృతిపట్ల మంత్రి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాత్ర విస్మరించలేనిదని అన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. సాయిచంద్ మృతిపట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం తెలిపారు. తెలంగాణ గొప్ప గొంతుకను కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సాయిచంద్ ఆకస్మిక మృతిని తెలుకున్న ఎంపీ సంతోష్ కుమార్.. కేర్ హాస్పిటల్‌కు వెళ్లారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
Read Also: Shayana Ekadashi Special: శయన ఏకాదశి వేళ ఈ స్తోత్రాలు వింటే సిరిసంపదలు పొందుతారు
సాయిచంద్ మృతిపై డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నానని ఆయన తెలిపారు. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర అంటూ.. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్దిస్తున్నాను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు.
Read Also: Cyber Crime: హైదరాబాద్ లో హైటెక్ మోసాలు.. సైబర్ నేరాల పట్ల జర ఫైలం
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మృతి పట్ల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో, పునర్నిర్మాణంలో సాయి చంద్ ఎంతో కీలకమన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుతున్నాను అని ఆయన అన్నారు.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా టీఎస్ సింగ్ డియో నియామకం
తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజా చైతన్యం తీసుకువచ్చిన ప్రముఖ గాయకుడు.. కళాకారుడు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం గొప్ప గాయకున్ని కోల్పోయిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం తన గొంతుకను వినిపించిన సాయిచంద్ లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని మంత్రి తెలిపారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నట్లు ఆమె తెలిపారు.