రానున్న రెండు రోజులు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపిన వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం, గురువారం అతి నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రంలోని గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని అన్నారు. ధరణి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర ప్రభుత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అధికారిక పోర్టల్ అని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి, రైతు సమాజానికి గౌరవం కలిగించే విధంగా మోడీ సర్కారు కార్యక్రమాలు చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.. ఈ మేరకు అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.. ఇక భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు తదితర అన్ని రకాల విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ…
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాగుకు ఆధారంగా ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. 1963 జులై 26న నాటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద శంకుస్థాపన చేసి.. దీనిని ఒక ఆధునిక దేవాలయంగా అభివర్ణించారు.
Red Alert issued for Next Two Days in Hyderabad: రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరం అయితేనే బయటికి రావాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా…
బాబోయ్ వర్షాలు.. ఎన్నడూ చూడని విధంగా దంచికొడుతున్నాయి.. ఎటు చూసిన రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి.. తెలంగాణలో వర్షాలు గత కొద్దిరోజులుగా దుమ్ముదులిపి దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. ఈరోజు సాయంత్రం నుంచి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలూ పడ్డాయి. అయితే.. మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని…