ధరణి పోర్టల్ పై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రంలోని గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని అన్నారు. ధరణి ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర ప్రభుత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అధికారిక పోర్టల్ అని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ తో తెలంగాణలో భూములకు రెక్కలు వచ్చాయని.. వాటి విలువ పెరిగిందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ధరణి పోర్టల్ తో రైతు తప్ప ఎవరూ భూమి యాజమాన్యాన్ని మార్చలేరని పేర్కొన్నారు. దీంతో భూముల ధరలు పెరిగినా రాష్ట్రంలోని గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయని తెలిపారు.
Pushpa 2: ‘పుష్ప 2’ లో శ్రీలీల ఐటెంసాంగ్.. ?
ధరణి పోర్టల్ తో రైతులకు మూడు రకాలుగా మేలు జరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. “భూ రికార్డులు భద్రంగా ఉన్నాయి, రైతు బంధు-వరి సేకరణ మొత్తాలు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయబడతాయి.. రైతులు ఇకపై ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్ళడం లేదు” అని ఆయన తెలిపారు. తెలంగాణలో మొత్తం భూములు 2.75 కోట్ల ఎకరాలు ఉంటే.. అందులో 1.56 కోట్ల ఎకరాలు ధరణి పోర్టల్‌లో ఉన్నాయి అని కేసీఆర్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ లో ఒకట్రెండు సమస్యలున్నాయనీ, వాటిని ఉన్నతాధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తే పరిష్కరించుకోవచ్చని.. ఇలాంటి చిన్నచిన్న సమస్యలను పెద్ద సమస్యలుగా చూపించేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయన్నారు. మరోవైపు ధరణి పోర్టల్ పై ప్రతిపక్షాలు విమర్శల దాడికి దిగుతూనే ఉంది. ధరణి పోర్టల్, ప్రభుత్వ భూములు విషయంలో అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యద్ధం జరుగుతోంది.