కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు మళ్లీ షాక్ ఇచ్చింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా శాసనసభ్యుడిగా తన ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టే ఇవ్వాలని వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. వనమా విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు మధ్యంతర తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత రెండు రోజులుగా వర్షాలు తగ్గడంలేదు.. బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది.. ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నభారీ వర్షాల దృష్ట్యా తెలంగాణాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పటికి వర్షం తగ్గక పోవడంతో శుక్రవారం, 27 జులై కూడా సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. వర్షాలపై సమీక్షించ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం…
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 నుంచి 2021 మధ్య మహిళలు, బాలికల మిస్సింగ్ పై ఇవాళ రాజ్యసభకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది.
తెలంగాణాలో క్రైం రేటు రోజురోజుకు పెరిగిపోతుంది.. మొన్నటివరకు రోడ్డు ప్రమాదాలతో జనాలు అనేక ఇబ్బందులు పడితే.. నేడు హత్యలు కలకలం రేపుతున్నాయి.. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరగడం వల్లో కుటుంబ కలహాల వల్లనో హత్యకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది.. క్షనీకావేశంలో జరిగే హత్యలతో కుటుంబాలు విచ్చిన్నం అవుతాయి.. తాజాగా పెద్దపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది.. నిద్రిస్తున్న ఓ వ్యక్తి పై కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసి అతి కిరాతాకంగా సజీవ దహనం…
రానున్న రెండు రోజులు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపిన వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం, గురువారం అతి నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.