తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు.. ఈ మేరకు అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.. ఇక భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు తదితర అన్ని రకాల విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది తెలంగాణ సర్కార్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం..
గత రాత్రి అధికారిక ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. మొత్తంగా చూస్తే.. వర్షాల కారణంగా ఈ నెలలో భారీగా విద్యార్థులకు సెలవులు వచ్చాయి.. పోయిన వారం ఏకంగా మూడు రోజులు సెలవులు
ప్రకటించారు… ఈ నెల 20, 21 తేదీల్లోనూ భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం వర్షాలు మళ్లీ దంచి కొడుతుండడంతో సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఈ నెలలోనే మొహర్రం కూడా ఉంది. ఈ నెల 29న (శనివారం) మొహర్రం సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత రోజు ఆదివారం..
ఈ క్రమంలో ఈ నెలలో మరో 2 సెలవులు విద్యార్థులకు రానున్నాయి. వర్షాలు అధికంగా ఉంటే.. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.. ఈ నెల 28న మొహర్రం సందర్భంగా ఆప్షనల్ హాలీడే ఉద్యోగులకు ఉంటుంది. ఆప్షనల్ హాలీడే తీసుకున్న వారికి వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి… ఇక వర్షాలు మాత్రం ఇప్పట్లో తగ్గేలా లేవు.. ఇప్పటి వరకు కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటిమయం అయ్యాయి.. రోడ్లు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి.. జనాలు వర్షాలకు ఇబ్బందులకు గురవుతున్నాయి.. మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు..